గ్రీన్ టీ ఆరోగ్యానికి చాలా మంచిది. గ్రీన్ టీ లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభ్యమవుతాయి. ముఖ్యంగా గ్రీన్ టీ తాగడం వల్ల శరీర బరువు తగ్గుతారు. రెగ్యులర్ గా ఒకటి, రెండు కప్పుల గ్రీన్ టీ తాగడం వల్ల చర్మం, జుట్టు అందానికి అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. అలాగే గ్రీన్ టీ సౌంద‌ర్య సాద‌న‌ల్లో కూడా ఉప‌యోగించ‌వ‌చ్చు. గ్రీన్ టీ ను స్కిన్ కేర్ రొటీన్ లో భాగంగా వాడేందుకు అనేక మార్గాలున్నాయి. అయితే ఇప్పుడు మనం గ్రీన్ టీ ఐస్ క్యూబ్స్ గురించి తెలుసుకుందాం.

 

రోజులో ఎప్పుడైనా వీటిని వాడవచ్చు. గ్రీన్ టీ ఐస్ క్యూబ్స్ చర్మస్థితిని మెరుగుపరుస్తాయి. గ్రీన్ టీ లో లభ్యమయ్యే యాంటీ బాక్టీరియల్ ప్రాపర్టీస్ ద్వారా చర్మంపై దర్శనమిచ్చే ఇబ్బందికర మొటిమల నుంచి విముక్తి పొందవచ్చు. పోర్స్ క్లాగ్ అవటం వలన లేదా ఇన్ఫెక్షన్ వలన మొటిమలు ఏర్పడతాయి.  గ్రీన్ టీ ఐస్ క్యూబ్స్ తో వీటిపై రుద్దడం ద్వారా ఇంఫ్లేమేషన్ తో పాటు రెడ్ నెస్ ను త‌గ్గిస్తాయి. గ్రీన్ టీ ఐస్ క్యూబ్స్‌తో ఫేస్‌ను కాసేపు మృదువుగా ర‌బ్ చేయాలి.

 

ఇలా చేయ‌డం వ‌ల్ల గ్రీన్ టీలో ఉండే ఫాలీఫినాల్స్ చర్మం సాగకుండా లేదా వదులవ్వకుండా ఉబ్బుగా కనబడేట్లు చేస్తుంది. అలాగే రోజుకు రెండు గ్రీన్ టీ ఐస్ క్యూబ్స్ ను చర్మంపై రబ్ చేయడం వలన చర్మం సహజ కాంతిని సంతరించుకుంటుంది. మ‌రియు ఐస్ క్యూబ్స్ అస్ట్రింజెంట్ నేచర్ కలిగి ఉండటం వలన ఇవి ఓపెన్ పోర్స్ ను ప్రభావవంతంగా చిన్నవిగా మార్చగలవు. తద్వారా, పేరుకుపోయిన డెడ్ స్కిన్ సెల్స్ మరియు మలినాలను తొలగించగలవు.

 
 
 
  
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: