కొబ్బరి పాలు.. ఎంత అందాన్ని ఇస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. అలాంటి కొబ్బరి పాలు జుట్టుకు ఎంతో పోషణను ఇస్తాయి.. కేవలం జుట్టుకు మాత్రమే కాదు చర్మానికి కూడా ఎంతో అందాన్ని ఇస్తాయి. అలాంటి ఈ కొబ్బరిని ఎలా ఉపయోగించాలో తెలుసుకొని అందాన్ని ఇలా మీ సొంతం చేసుకోండి. 

 

ఇంకొద్ది రోజులలో ఎండ కాలం వస్తుంది.. ఎండ ధాటికి చర్మం కమిలి తింటుంది. అందుకే కొబ్బరిపాలలో ముంచిన దూదితో 5 నిమిషాల పాటు సున్నితంగా మర్దన చేయటం వల్ల కందిన, నల్లబడిన చర్మం సరికొత్త నిగారింపును ఇస్తుంది. 

 

నీటిలో కొబ్బరిపాలు, గులాబీ రెక్కలు, తేనే కలిపి ఆ నీటితో స్నానం చేస్తే పొడిబారిన చర్మం కాంతివంతంగా తయారవుతుంది. 

 

చెమట, దుమ్ము దూళి, కాలుష్యం వల్ల వచ్చే మొటిమలు, కురుపులు తగ్గాలంటే కొబ్బరిపాలలో చెంచా నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని తలకు పట్టించుకుంటే చక్కటి ఫలితాన్ని అందిస్తుంది. 

 

చిక్కని కొబ్బరి పాలలో తేనే, బియ్యపు రవ్వ, బాదం నూనె కలిపి మిశ్రమాన్ని పట్టించుకుంటే పాదాలు మృదువుగా మారుతాయి. 

 

కొబ్బరిపాలలో చెంచా నిమ్మరసం కలిపి తలకు పట్టించి స్నానం చేస్తే జుట్టు రాలడం తగ్గి మృదువుగా తయారవుతుంది. 

 

చిట్లిన, పొడిబారిన జుట్టుకు కొబ్బరి పాలను బాగా పట్టించి ఆరిన తర్వాత తలస్నానం చేస్తుంటే జుట్టు రాలటం ఆగి బలంగా పెరుగుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: