సాధార‌ణంగా మనం రకరకాల చర్మ సంబంధ సమస్యలను ఎదుర్కుంటాము. కొన్నిసార్లు ఈ చర్మసమస్యలు ఇతర సమస్యలకు దారితీస్తాయి. ఈ నేప‌థ్యంలోనే నల్ల మచ్చలు, మొటిమలు,చర్మం పొడిబారటం వంటి సమస్యలు చాలామందిలో చూస్తుంటాం. అయితే ఇలాంటి స‌మ‌స్య‌ల‌న్నిటికీ పాలు మ‌రియు తేనెతో సులువుగా చెక్ పెట్ట‌వ‌చ్చు. పాల వలన ఆరోగ్యానికి మాత్రమె కాకుండా, ఎముకలు దృడంగా ఉండుటలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. అలాగే పాల ఆరోగ్యంతో పాటు అందం కూడా పెంపొందించుకోవ‌చ్చు. 

 

మ‌రియు తేనే లో ఉన్న విటమిన్స్... శరీర వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అంతే కాదు, తేనె సౌందర్యానికి కూడా చాల గ్రేట్ గా సహాయపడుతుందు. ఇక ఈ రెండిటి క‌ల‌యిక‌తో ఎన్నో సౌంద‌ర్య ప్ర‌యోజ‌నాలు పొందొచ్చు. పాలు మరియు తేనెలతో తయారు చేసిన ఫేస్ ప్యాక్, మీ చర్మ సమస్యలున్నింటికి సరైన పరిష్కారం చూపిస్తుంది. అందుకు ముందుగా పాలు మ‌రియు తేనె క‌లిపి ముఖానికి, మెడ భాగాలలో పూసి, ఎండే వరకు వేచి ఉండండి. ఆ తరువాత గోరువెచ్చని వేడి నీటితో కడిగి వేయండి. దీని వ‌ల్ల ముఖంపై ఉన్న మ‌లినాలు తొల‌గి ప్ర‌కాశ‌వంతంగా మారుతుంది.

 

పగిలిన పెదవులు లేదా మడమలకు శీతాకాలంలో ఈ ప్యాక్ ను పూసుకుంటేచాలా మేలు చేస్తుంది. ఇలా క్రమం తప్పకుండా వాడితే చర్మం ఆరోగ్యవంతంగా తయారవుతుంది. అదే విధంగా, పాలు మరియు తేనెల ఫేస్ ప్యాక్ చర్మంలో మలినాలను బయటకు నెట్టేసి, మచ్చలను మరియు పిగ్మెంటేషన్ ను తగ్గిస్తుంది.మొటిమలను సమర్ధవంతంగా తొలగిస్తుంది. మొటిమలనేవి మీకు పెద్ద సమస్యగా మారి, ఎన్ని ప్రయత్నాలు చేసినా తగ్గకుండా ఉంటే, ఈ ఫేస్ ప్యాక్ అద్భుతమైన సమాధానం చెప్తుంది. సో.. త‌ప్ప‌కుండా ఉప‌యోగించండి..!

 
 
   

మరింత సమాచారం తెలుసుకోండి: