చర్మ సౌందర్యానికి మనం అష్టకష్టాలు పడుతుంటాం. ఆ క్రీమనీ, ఆ బ్యూటీ పార్లర్ అని ఎక్కడెక్కడికో వెళ్ళి చర్మ సౌందర్యం ఇనుమడింపచేసుకునేలా ప్రయత్నిస్తాం. కానీ ఫలితాలు ఒక్కోసారి ఒక్కోలా ఉంటాయి. అయితే ఎలాంటి ఖ‌ర్చు లేకుండా వంటింటి చిట్కాల‌తోనే మ‌న చ‌ర్మ సౌంద‌ర్యాన్ని పెంపొందించుకోవ‌చ్చు. సాధార‌ణంగా భారతదేశంలో ఉన్న ప్రతి ఇంటిలో పాలపొడి వాడుకలో ఉంటుంది. ఈ పాలపొడిలో లాక్టోస్ సమృద్ధిగా ఉన్నందున, అనేక చర్మ సంబంధిత సమస్యలకు ఇది ఒక పరిష్కార మార్గంగా పనిచేస్తుంది.

 

నల్లని మచ్చలు, సన్ బర్న్ మ‌రియు టాన్ వంటి వాటినుంచి మీ చర్మాన్ని సంరక్షించి, ప్రకాశవంతమైన చర్మాన్ని పొందటం కోసం పాలపొడిని ఉపయోగించవచ్చు. మ‌రి అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా పాలపొడి, ఆలివ్ ఆయిల్‌, బాదం ఆయిల్ మ‌రియు రోజ్ వాటర్ మూడు బాగా క‌లుపుకోవాలి. దీన్ని ముఖానికి అప్లే చేసి.. పావుగంట పాటు ఆర‌నిచ్చి క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల   చర్మంపై ఏర్పడే మలినాలకు కారణమైన బ్యాక్టీరియాను చంపి.. ఆ తర్వాత చనిపోయిన చర్మకణాలను తొలగిస్తుంది.

 

దీంతో ముఖం కాంతివంతంగా క‌నిపిస్తుంది. పాలపొడి మ‌రియు అర‌టిపండు గుజ్జు క‌లిపి ఫేస్‌కు బాగా అప్లై చేయాలి. పావు గంట త‌ర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ మొటిమ‌లు తొల‌గిస్తుంది. అదే విధంగా డార్క్ స్పాట్స్ను తొలగించేందుకు మరొక ప్రత్యామ్నాయమైన పరిష్కారం కూడా ఉంది. అదేమిటంటే, పాలపొడిని, కొద్దిగా రోజ్ వాటర్‌ను తీసుకుని బాగా మిక్స్ చేసి, దూది సాయంతో మీ ముఖానికి అప్లై చేయండి.  పావు గంట వరకు బాగా ఆరిన తరువాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రంగా కడగాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం పొందొచ్చు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: