ఎంతో మంది మహిళలు ఈ సమస్యతో బాధ పడుతుంటారు.. పాపం.. బరువు పెరిగి తగ్గిన.. పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత వారికీ ఈ సమస్య మొదలవుతుంది. అది ఏంటి అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్న.. గర్బాధారణ సమయంలో, బరువు పెరిగిన సమయంలో చర్మం సాగి చారలు ఏర్పడుతాయి. 

 

బరువు తగ్గినప్పుడు ఆ స్ట్రెచ్ మర్క్స్ అనేవి వస్తాయి. వాటిని ఏం చేసిన సరే అవి తగ్గవు.. ఆరోగ్యంగా తయారవ్వరు.. చివరికి వైద్యులను కూడా కలుస్తారు.. వాళ్ళు కొన్ని రకాల క్రిములు రాసిస్తారు.. కానీ వాటి వల్ల ఉపయోగం ఉండదు.. అలాంటి ఆ క్రిముల వల్ల ఈలాంటి ఉపయోగము ఉండదు.. కానీ కొన్ని వంటింటి చిట్కాలు పాటించారు అంటే చాలు అవి ఇట్టే వెళ్లిపోతాయి. 

 

ఆముదంతో ప్రతిరోజూ చర్మానికి తైలమర్దన చేయాలి. చారలున్న భాగంపై గోరువెచ్చని ఆముదం రాసుకుని గంట తరువాత స్నానం చేస్తే చాలు. రాత్రిపూట నిద్రపోయే ముందు బాదం నూనెతో చారలున్న చోట మర్దన చేసి, మరుసటి రోజు ఉదయం వేడి నీటితో స్నానం చేయాలి. ఇలా చేసిన తరువాత ఆ ప్రాంతంలో కలబంద గుజ్జు రాసుకోవాలి. తులసి, వేపాకులకు గంధం, మంజిష్టను కలిపి ముద్దగా నూరి స్ట్రెచ్ మర్క్స్ ఉన్న చోట లేపనంలా రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. చూశారుగా.. ఈ చిట్కాలు పాటించి మీ చర్మంపై ఉండే స్ట్రెచ్ మర్క్స్ ని తొలిగించండి. అందంగా కనిపించండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: