ఇప్పుడు అమ్మాయిలందరికీ స్లీవ్ లెస్ టాప్ లు వేసుకోవటానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కాని, అండర్ ఆర్మ్స్ నల్లగా ఉంటాయనే భయంలో వేసుకోనేందుకు కాస్త సందేహిస్తారు. కొన్ని రకాల పదార్థాలతో స్కిన్ కాంటాక్ట్ జరిగినప్పుడు డార్క్ అండర్ ఆర్మ్స్ సమస్య తలెత్తుతుంది. షేవింగ్, తరచూ హెయిర్ రిమూవింగ్ క్రీమ్స్ ను వాడటం, చెమట ఎక్కువగా పట్టడం, అండర్ ఆర్మ్స్ కి గాలి సరిగ్గా ఆడకపోవడం, డెడ్ స్కిన్ సెల్స్ పేరుకుపోవడం ఇలా అనేక కార‌ణాల వ‌ల్ల అండ‌ర్ ఆర్మ్స్ డార్క్ గా మార‌తాయి.

 

అయితే చిన్న చిన్న హోమ్ మేడ్ చిట్కాతో ఈ నలుపు పోగోట్టవచ్చు. అండర్ ఆర్మ్స్ వద్ద డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించేందుకు ఒక నిమ్మకాయను కట్ చేసి నిమ్మ చెక్కతో ప్రభావిత ప్రాంతంపై కొద్ది నిమిషాలపాటు రుద్ది.. కాసేపు అలా ఆర‌నివ్వండి. ఆ త‌ర్వాత క్లీన్ చేసుకోవ‌డం వ‌ల్ల నిమ్మ నేచురల్ బ్లీచ్ గా పనిచేస్తుంది. బేకింగ్‌ సోడా, కొబ్బరినూనె సమపాళ్లలో కలుపుకొని, బాహుమూలాల్లో స్క్రబ్‌ చేయాలి. ఒక పావుగంట త‌ర్వాత నీళ్ల‌తో క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల డార్క్ నెస్‌ను త‌గ్గిస్తుంది.

 

అలాగే డెడ్ స్కిన్ సెల్స్ అనేవి డార్కర్ స్కిన్ సమస్యకు దారితీస్తాయి. కాబట్టి, డెడ్ స్కిన్ ను అండర్ ఆర్మ్స్ వద్ద చర్మం నుంచి తొలగించడం ముఖ్యం. ఒక టీస్పూన్ షుగర్ లో కాస్తంత కొబ్బరి నూనెను కలిపి ఈ మిశ్రమాన్ని అండర్ ఆర్మ్స్ వద్ద అప్లై చేయండి. కొన్ని సెకండ్ల వరకు స్క్రబ్ చేయండి. కొద్ది సేపటి తరువాత వాష్ చేస్తే మంచి ఫ‌లితం ఉంటుంది. టమాటో జ్యూస్ ను తీసుకుని ఈ జ్యూస్ ను ప్రభావిత ప్రాంతంపై రాయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల డార్క్ ప్యాచెస్ ను సహజంగా తొలగిపోతాయి.
  
  

మరింత సమాచారం తెలుసుకోండి: