ఘాటైన సువాసనతో పాటు.. కమ్మని రుచితో నోరూరించే పుదిన గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఎన్నో ఔషధ గుణాలు దాగివున్న ఆరోగ్య పుష్కరిణిగా పుదీనాను చెప్పుకోవచ్చు. సంవత్సరం పొడవునా లభించే పుదీనా మొక్కలో ప్రతి భాగం ఉపయోగపడేదే.. ఔషధతత్వాలు ఉన్నదేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే వంటింట్లో విరివిగా వాడే పుదీనా ఆరోగ్యాన్నే కాదు.. అందాన్నీ అందిస్తుంది. దీన్ని ముఖ సౌందర్యానికి వినియోగించుకుంటే మంచి ఫలితం ఉంటుందని వైద్యులు కూడా చెబుతున్నారు. మ‌రి అవేంటో ఓ లుక్కేసేయండి.

 

కొన్ని పుదీనా ఆకులను నలిపి ముఖం మీద మొటిమల ప్రభావిత ప్రాంతానికి రాయండి. కొంతసేపు తరువాత నీటితో కడిగేయండి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే కొద్ది రోజుల్లో మొటిమలు మరియు మచ్చలు పూర్తిగా మాయమవుతాయి. వాస్త‌వానికి పుదీనా ఆకులలోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు మొటిమలను కలిగించే కణాలను తొలగిస్తాయి. పుదీనా రసానికి, బొప్పాయి రసం కలిపి చర్మ వ్యాధులు వచ్చిన చోట రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అంతేకాకుండా పుదీనా చర్మం ముడతలు పడకుండా, త్వరగా వృద్ధాప్య ఛాయలు రాకుండా కూడా ఈ ప్యాక్ సాయపడుతుంది.

 

పుదీనా ఆకులకు చర్మంపై ముడుతలు మరియు సన్నని గీతలను పోగొట్టే లక్షణాలు ఉన్నాయి. ఇవి ముఖంపై నుండి ఫ్రీరాడికల్స్ ను తొలగించి, చర్మాన్ని వయసు మీరడం నుండి సంరక్షిస్తుంది. కొన్ని పుదీనా ఆకులను తీసుకుని నీళ్లలో వేసి మరిగించండి. ఇది బాగా చ‌ల్ల‌రాక ఆ నీటిని ముఖానికి అప్లై చేసి కాసేపు ఆగాక క్లీన్ చేసుకుంటే స‌రిపోతుంది.పుదీనా ఆకుల్లో కొన్ని చెంచాల గ్రీన్ టీ వేసి మిశ్రమంలా చేయాలి. దీన్ని చేతులు, మెడకు పూతలా వేస్తే… కాలుష్యం కారణంగా పేరుకున్న మురికి వదిలిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: