వేప ఆకులకు ఆయుర్వేదంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. అనేక రకాల రోగాలను నయం చేసేందుకు వేప ఆకులను విరివిగా వాడుతారు.శతాబ్దాలుగా వేప ఆకులు తమ యాంటీబాక్టీరియల్ గుణాలకు పేరెన్నికగన్నవి. వీటిలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. అవి చర్మ మరియు శిరోజ సమస్యల నుండి విముక్తినిస్తాయి. వేపాకులలో పుష్కలంగా ఉండే పోషకాలు, విటమిన్లు జుట్టు ఎదుగుదలను ప్రోత్సాహించి మరియు చర్మాన్ని సంరక్షించి సౌందర్య సమస్యలను దూరం చెస్తాయి.

 

మ‌రి వేపాకుతో చ‌ర్మ, కేశ‌ సంద‌ర్యాన్ని ఎలా పెంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మొటిమలు, మచ్చలు, బర్న్స్, మరియు గాయాల వల్ల ఏర్పడ్డ స్కార్స్ ను త్వరగా మాయం చేయడంలో వేప పేస్ట్ గ్రేట్ . స్కార్స్ ను త్వరగా కనబడనివ్వకుండా చేస్తుంది. అందుకోసం వేప‌ పేస్ట్ లో కొద్దిగా పసుపు మిక్స్ చేసి రెగ్యులర్ గా స్కార్ మాయమయ్యే వరకూ అప్లై చేయాలి. వేపాకులలో సహజంగా జుట్టు ఎదుగుదలకు అవసరమయ్యే పోషకాలు ఉన్నాయి. కనుక జుట్టు బాగా పెరగడానికి ఇవి ఉపయోగకరమైనవి. కొన్ని వేపాకులలో పెరుగు వేసి మెత్తని ముద్దగా నూరండి. 

 

దీనిని కుదుళ్ల నుండి చివర్ల వరకు జుట్టుకు బాగా పట్టించండి. మంచి ఫలితాల కొరకు వారానికి రెండుసార్లు ఇలా చేయండి. అలాగే నీమ్ లీవ్స్, రోజ్ పెటల్స్ తీసుకుని మెత్తగా పేస్గ్ చేయాలి. రోజ్ వాటర్ మిక్స్ చేసి ముఖానికి పట్టించి డ్రైగా మారిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ వల్ల చర్మం స్మూత్ గా చేస్తుంది. వేపాకుల జుట్టు పలుచబడకుండా చేసి రాలడాన్ని తగ్గిస్తుంది. కొన్ని వేపాకులలో పాలు వేసి మెత్తని ముద్ద చేయండి. దీనిని జుట్టుకు పట్టించి గంట తరువాత శుభ్రంగా కడగండి. ఇది మంచి ఫ‌లితం ఇస్తుంది.
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: