స్మూత్, సిల్కీ మరియు హెల్తీ హెయిర్ ని ప్రతి మ‌హిళా కోరుకుంటుంది. నిజానికి ఆడ‌వారి అందాన్ని మరింత రెట్టింపు చేసేది కేశసౌందర్యమే కదా. అటువంటి శిరోజాలకు ఏమైనా సమస్యలు తలెత్తితే మగువలకు మనశ్శాంతి లోపిస్తుంది. అయితే, కెమికల్ హెయిర్ ట్రీట్మెంట్, పొల్యూషన్ వంటి పర్యావరణ కారకాలు మ‌రియు ఎండలో ఎక్కువ సేపు ఉండటం వంటి వివిధ కారణాల వలన శిరోజాల సౌందర్యం దెబ్బతింటుంది. అయితే శిరోజాల‌ను ర‌క్షించుకోవ‌డానికి ఉప‌యోగించే వాటిలో బీర్ కూడా ఒక‌టి. అవును! మీరు విన్న‌ది నిజ‌మే. బీర్ తో  జుట్టుకు ఎన్నో అద్భుతాలు చేయొచ్చు.

 

మత్తుపానీయంగా మాత్రమే కాకుండా బీరును జుట్టు పోషణకై రకరకాలుగా వాడవచ్చు. బీరులో దెబ్బతిన్న జుట్టును బాగుచేసి దాని నిర్మాణాన్ని పునరుద్ధరించడానికి అవసరమైన ప్రొటీన్లు ఉంటాయి. బీరులో ఉండే విటమిన్ B జుట్టు పొడవు ఎదగడానికి తోడ్పడితే, అందులో ఉండే మాల్టోస్ జుట్టును బలంగా చేస్తుంది. అందుకు ముందుగా ఒక బౌల్‌లో బీరును, ఎగ్ వైట్‌ మ‌రియు అవకాడో ఆయిల్ వేసి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని జుట్టు  కుదుళ్లనుండి చివర్ల వరకు బాగా ప‌ట్టించి మర్దన చేయండి.  

 

అరగంట తర్వాత షాంపూ మరియు కండీషనర్ తో కడిగేయండి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎలాంటి జ‌ట్టు స‌మ‌స్య‌లైనా త‌గ్గిపోతాయి. బీరులో అతి ముఖ్యమైన విటమిన్ బయోటిన్ ఉంటుంది. ఇది జుట్టును ఆరోగ్యవంతంగా ఎదగనిస్తుంది.అంతే కాకుండా బయోటిన్ చుండ్రును నివారించి జుట్టు రాలటాన్ని అరికడుతుంది. అలాగే బీర్‌ మంచి కండిషనర్‌లా ప‌నిచేస్తుంది. బీర్‌తో జుట్టుని కడిగి కొన్ని నిమిషాల తరువాత చల్లటి నీళ్లతో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు మెరుస్తుంటుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: