కొబ్బరినూనె శిరోజాలకు చాలా మంచిద‌ని మాత్రంమే చాలా మందికి తెలుసు. కానీ దాంతో మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు. దశాబ్దాలుగా కొబ్బరినూనె అంటే మన బామ్మలకు అపారమైన ప్రేమ. తరతరాలుగా అనేక సౌందర్య సమస్యలకు కొబ్బరినూనె అద్భుతమైన పరిష్కారంగా వారు మనందరికీ పరిచయం చేశారు. సౌందర్యపరంగా ఎదురయ్యే ఎన్నో సమస్యలకు చక్కని పరిష్కారం కొబ్బరినూనె. మొటిమలు, మ‌చ్చ‌లు తగ్గుతాయి. అంతేకాదు చర్మం మృదువుగా, ఆరోగ్యంగా తయారవుతుంది. ముడతలు పడదు, పొడిబార‌కుండా కూడా చేస్తుంది.

 

మ‌రి దీన్ని ఎలా ఉప‌యోగించాలో ఓ లుక్కేసేయండి. చ‌ర్మంపై మృతకణాలు పోవాలంటే.. రెండుమూడు టేబుల్‌స్పూన్ల కొబ్బరినూనెలో కొద్దిగా చక్కెరా, రెండు మూడు చుక్కల లావెండర్‌ నూనెను కలిపి ఒంటికి రాసుకోవాలి. కాసేపయ్యాక స్నానం చేయాలి. దీంతో మృతకణాలు పోవడంతోపాటూ చర్మం కూడా మృదువుగా మారుతుంది. చర్మానికి అద్భుతమైన మాయిశ్చరైజర్‌ అంటే అది కొబ్బరి నూనె. కొద్దిగా అరచేతిలో కొబ్బరి నూనె వేసుకొని రెండు చేతులకూ రాసి పొడిబారిన చర్మం మీదుగా రాయాలి. 

 

త్వరగా రిలీఫ్‌ లభిస్తుంది. చర్మం పొడిబారడం సమస్యా తగ్గుతుంది. అలాగే కళ్ల కింద నల్లని వలయాలు చాలామందిలో కనిపించే సమస్య. ఇక్కడ చర్మం అతి సున్నితంగా ఉంటుంది కాబట్టి విరుగుడు కోసం వాడేవి జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. అయితే కంటికింద భాగంలో కొబ్బరినూనెని రాస్తూ ఉంటే ఆ నల్లని వలయాలు, ముడతలు తగ్గుముఖం పడతాయి. మ‌రియు కొబ్బరినూనెకి పసుపు మరియు పాలను కలపండి. దీని ముఖానికి బాగా పట్టించండి. పాలలో ఉండే లాక్టిక్ ఆమ్లం చర్మాన్ని కాంతివంతంగా మార్చి అధికంగా ఉన్న పిగ్మెంట్లను తొలగిస్తాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: