మనకు ఇంట్లోనే ఏదైనా న్యాచురల్ గా మన జుట్టును అందంగా.. దృడంగా తయారు చేస్తుంది అంటే అది మందారం ఆకునే. అలాంటి మందారంను జుట్టుకు ఎలా ఉపయోగించాలి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. మీ జుట్టును అద్భుతంగా మార్చుకోండి. ఆ చిట్కాలు ఏంటో ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

జుట్టు రాలకుండా ఉండాలంటే తలస్నానం చేసే ముందు కనీసం గంటా, గంటన్నర ముందు తప్పనిసరిగా నువ్వులనూనె, ఆలివ్‌ నూనెని గోరువెచ్చనిగా చేసి తలకు రాసుకొని మర్దన చేయాలి. ఇలా మర్దన చెయ్యడం వల్ల రక్తప్రసరణ సక్రమంగా జరిగి, కుదుళ్లు దృఢంగా మారి, జుట్టు రాలే సమస్య ఇట్టే తగ్గుతుంది.

 

గుప్పెడు మందారపూలను మెత్తగా పేస్ట్ లా చేసి అందులో పావుకప్పు పెరుగు కలిపి తలకు పూతలా వేసుకోవాలి. అరగంట అయ్యాక తలస్నానం చేస్తే సరిపోతుంది. 

 

వేడి నీళ్లలో కాసేపు గ్రీన్‌ టీ బ్యాగును ఉంది 5,6 నిముషాలు అయ్యాక బ్యాగు తీసేయాలి. ఆ నీటిని తల మీద పోసుకుని జుట్టు మొత్తం తడిసేలా చూసుకోవాలి. అంతే ఈ చిట్కాను వారానికి 2 లేదా 3 సార్లు చేస్తే జుట్టు పెరగడానికి దోహదం చేస్తాయి.

 

రాత్రి సమయంలో పెరుగులో 5 చెంచాల మెంతుల్ని నానబెట్టుకోవాలి. రెండూ కలిపి ఉదయాన్నే మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ లా తయారు చెయ్యాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి అరగంట అయ్యాక షాంపూతో తలస్నానం చేయాలి అంతే జుట్టు ఆరోగ్యంగా మారిపోతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: