ప్రస్తుత వాతావరణ పరిస్థితులు.. మనం తీసుకునే ఆహారం కారణంగా మన దంతాల రంగు, కాంతిని కోల్పోవడమే కాదు వాటికీ ఉన్న సహజత్వాన్ని కూడా కోల్పోతున్నాయి. అందుకని మల్లి మన దంతాలు మెరిసిపోవాలని ఎన్నో మందులు వాడుతాం.. పేస్ట్ లు మారుస్తాం కానీ ఎటువంటి లాభము ఉండదు.. అలాంటి సమయంలో ఇంట్లో ఉండే పదార్ధాలతో మీ దంతాలను మెరిపించుకోవచ్చు. అయితే అది ఎలా అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

కొబ్బరినూనె.. చెంచా కొబ్బరి నూనెను నోట్లో పోసుకుని 5 నిమిషాలు పుక్కిలించి ఉమ్మేయాలి అలాగే బ్రెష్ చేసే సమయంలో 5,6 చుక్కలు కొబ్బరి నూనె వేసి పళ్ళు బాగా తోమాలి.. ఇలా చెయ్యడం వాళ్ళ దంతాలు శుభ్రపడి మెరిసిపోతాయి. 

 

వెనిగర్‌.. స్పూన్ వెనిగర్‌ను తీసుకొని బ్రష్ చెయ్యాలి.. ఆ తర్వాత చల్లటి నీటితో శుభ్రపరుచుకోవాలి. అంతే చిగుళ్లు ఆరోగ్యంగా తయారవుతాయి. 

 

నిమ్మతొక్క.. నిమ్మ సహజ క్లెన్సర్‌లా పనిచేస్తుంది. నిమ్మ తొక్కను పళ్లపై రుద్దాలి. ఇలా చెయ్యడం వల్ల మురికిపోయి పళ్ళు మెరుస్తాయి.

 

వంటసోడా.. చెంచా వంటసోడాలో కాసిని నీళ్లు పోసి కలపాలి. దీన్ని బ్రష్‌పై తీసుకుని పళ్లు తోముకోవాలి. ఇలా వారానికోసారి చేస్తుంటే పళ్లు తళతళ మెరుస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: