అందంగా పొడవాటి సొగసైన కాళ్ళ చర్మాన్ని ఇష్టపడని అమ్మాయిలు ఎవరుంటారు? కదా! కానీ కొన్ని సార్లు కాళ్ళ‌మీద పెరిగిన వెంట్రుకలు, దదుర్లు మరియు రాషెస్ వ‌ల్ల ఇబ్బందిక‌రంగా ఫీల్ అవ్వాల్సి వ‌స్తుంది. ఇక వాక్సింగ్ మరియు షేవింగ్ వంటి హెయిర్ రిమూవల్ ప్రక్రియలు చర్మాన్ని నిస్తేజంగా మరియు నిగారింపు లేని కాళ్ళ‌కి కారణం అవుతుంటాయి. చాలామంది మహిళలు మోకాల పొడవు దుస్తులు లేదా షార్ట్స్ ధరించకపోవడానికి ఇది కూడా ఒక కారణం కావచ్చు.

 

అయితే కాళ్లు అందంగా, మృదువుగా మ‌రియు ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపించాలంటే ఈ టిప్స్ త‌ప్ప‌కుండా ఫాలో అవ్వ‌డం. గోధుమపింది, నిమ్మరసం, తేనె తీసుకోండి. వీటిని మెత్తని పేస్టుగా చేసి, మీ కాళ్లపై రాసి అరగంట అలా వదిలేయండి. తర్వాత శుభ్రంగా కడిగేయండి. ఈ ఇంటిచిట్కా మీకు అందమైన కాళ్ళను ఇచ్చి, అధికంగా పెరిగే వెంట్రుకలను తగ్గించి, కాళ్ళను మృదువుగా చేస్తుంది. కొబ్బరి నూనె మెరిసే కాళ్ళ ను పొందడానికి అల్టిమేట్ రెమెడీ. ప్ర‌తిరోజు కొబ్బరి నూనెతో మీ కాళ్ళను రుద్దండి మరియు రాత్రి అంతా అలానే వదిలివేయండి. 

 

ఇలా చేయ‌డం వ‌ల్ల మెరిసే కాళ్ళని పొందొచ్చు. కొన్ని ఉల్లిపాయ ముక్కలను కట్ చేసి, మీ కాళ్ళపై రుద్దండి. మీ కాళ్లలో కొంచెం ఏదో గుచ్చుకుంటున్న ఫీలింగ్ వచ్చేవరకు,చర్మం కొంచెం వెచ్చగా అన్పించేవరకు రుద్దండి. తర్వాత చల్లనీళ్లతో కడిగేయండి. ఇలా చేయ‌డం వ‌ల్ల కాళ్ళు మృదువుగా త‌యార‌వుతాయి. మ‌రియు షేవింగ్ చేసే సమయంలో, బేబీ ఆయిల్ ని షేవింగ్ క్రీంగా ఉపయోగించుకోండి, ఇది నిజంగా మీకు సున్నితమైన చర్మంను ఇస్తుంది.

  
 
  
  

 

మరింత సమాచారం తెలుసుకోండి: