ఉసిరికాయ ఎంత అందాన్ని ఇస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. కాలుష్యం, అనారోగ్యం సమస్య కారణంగా జుట్టు రాలిపోతుంది.. జుట్టు పొడిబారిన పడటం కారణంగా జుట్టు పూర్తిగా పాడైపోతుంది.. అలాంటి అనారోగ్యానికి గురైన జుట్టును ఆరోగ్యంగా మార్చాలంటే ఈ చిట్కాలు పాటించండి.. 

 

విటమిన్‌ 'సి' ఎక్కువగా ఉండే ఉసిరి కాయను ఆహారంలో భాగంగా చేసుకొని తింటే జుట్టుకు ఎంతో బలం చేకూరుతుంది. 

 

ఉసిరికాయను ఆహారంలో  తీసుకోవడం వల్ల చిన్నతనంలోనే జుట్టు తెల్లబడకుండా నల్లగా వత్తుగా ఉంటుంది. అంతేకాదు ఈ ఉసిరికాయ ఇనుము రక్తవృద్ధిని కలిగిస్తుంది. 

 

ఈ ఉసిరికాయ కారణంగా జుట్టు పెరగటమే కాకుండా.. చుండ్రు కూడా పూర్తిగా తగ్గిపోతుంది.

 

జుట్టు ఆరోగ్యంగా తేమతో నిగనిగలాడాలంటే కొబ్బరినూనెను క్రమం తప్పకుండా పట్టించాలి. ఇలా చెయ్యడం వల్ల జుట్టు రాలకుండా, చివర్లు చిట్లకుండా చేస్తుంది.

 

శీకాయ, కుంకుడుకాయలు చక్కటి క్లెన్సర్లుగా పనిచేసి జుట్టును శుభ్రపరుస్తాయి. ఇవి జుట్టును ఎంతో ఆరోగ్యంగా మారుస్తాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: