తెల్ల జుట్టు అనేది 30 ఏళ్ళు దాటిన తరువాత మొదలవుతుంది. నల్లగా ఉన్న జుట్టు పూర్తిగా తెల్లబడటానికి 45 ఏళ్ళు దాటితే చాలు ఈ వయసులో తెల్ల బడుతున్న జుట్టు మళ్ళీ నల్లబడటానికి అవకాశమే లేదు. అయితే ప్రస్తుత కాలంలో చాలా మంది యువకులకి అంటే సుమారు 25 ఏళ్ళు రాగానే జుట్టు తెల్లబడుతోంది. ఈ విషయం ఇలా ఉంచితే కేవలం 2 ఏళ్ళు నిండిన పిల్లలకి కూడా తెల్ల జుట్టు వచ్చేస్తోంది. ఈ మధ్య కాలంలో ఈ సమస్య ఎక్కువై పోతోంది. చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటంతో పిల్లల తల్లి తండ్రులు ఆందోళన చెందుతున్నారు. అయితే దీనికి ప్రధానమైన కారణం..

IHG

ప్రస్తుత జీవన శైలి, ఆహారపు అలవాట్లు, పోషక ఆహారం సమానంగా పిల్లలకి అందక పోవడం ద్వారా మాత్రమే ఈ పరిస్థితులు ఎదురవుతున్నాయి. 25ఏళ్ళకే జుట్టు తెల్లబడటంతో యువతీ యువకులు తీవ్ర నిరాశకీ లోనవుతున్నారు. ఈ పరిస్థితి నుంచీ గట్టెక్కడానికి కేవలం మన పురాతన ఆహారపు అలావాట్లు కొన్ని హోమ్ రెమీడీస్ మాత్రమే పరిష్కారం చూపగలవు. మరి ఇంటి చిట్కాలతో ఈ సమస్యని ఎలా అధిగమించచ్చో ఇప్పుడు చూద్దాం..

IHG

ఒక గిన్నె లోకి స్వచ్చమైన కొబ్బరి నూనె తీసుకుని, అందులో కొన్ని వేపాకులు వేసి బాగా మరిగించాలి. వేపలోని సద్గుణాలు అన్నీ నూనేలోకి చేరుకోవడంతో ఆ నూనె దివ్యమైన ఔషదంగా పనిచేస్తుంది. ఇప్పుడు ఆకులని తీసేసి నూనేని ఒక గిన్నెలోకి తీసుకుని భద్రపరుచుకుని రెండు రోజులకి ఒక సారి కుదుళ్ళకి చేరేలా పట్టించాలి. ఇలా చేయడం వలన సమస్య తొందరగా పరిష్కారం అవుతుంది.

IHG

ఆవు నెయ్యి సైతం పిల్లలలో జుట్టు తెల్లబడకుండా చేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. చిన్న పిల్లలకి వారానికి ఒక సారి అంటే ఆదివారం సమయంలో నెయ్యి తో మసాజ్ చేయాలి, జుట్టు కుదుళ్ళకి నెయ్యి చేరుకునేలా మసాజ్ చేసి తరువాత ఆరబెట్టుకోవాలి. ఇలా సుమారు గంట పాటు ఉంచిన తరువాత తల స్నానం చేస్తే జుట్టుకి మంచి పోషకాలు అంది జుట్టు తెల్లబడకుండా ఉంటుంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: