మనం అందంగా కనిపించడం కోసం నిత్యం ఎన్నో వంటింటి చిట్కాలు పాటిస్తుంటాం.. కొన్ని మన ముఖానికి సెట్ అయ్యి అందంగా తయారు చేస్తే.. మరికొన్ని చిట్కాలు ముఖానికి ఎఫెక్ట్ అవుతుంటాయి.. అలా అయినప్పటికీ మనం వాటిని క్రమం తప్పకుండ ఫాలో అవుతుంటాం అనుకోండి.. అది వేరే విషయం. ఇక పోతే ముఖానికి ఎప్పుడైనా పెసరపిండి ఉపయోగించారా? పెసర పిండి ముఖానికి ఎంత మంచిదో తెలుసా? అది ఉపయోగిస్తే ఎన్ని ఉపయోగాలు ఉంటాయి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

పెసరపిండి ముఖానికి పట్టించడం వల్ల ముఖం తాజాగా అందంగా.. ఆరోగ్యంగా ఉంటుంది. 

 

జిడ్డు చర్మానికి ఈ పెసరపిండి ఎంతో అద్భుతంగా ఉపయోగపడుతుంది. 

 

దుమ్ము, దూళి కారణంగా మొటిమల సమస్యా పెరిగిపోతుంది. అలాంటి సమయంలో పెసరపిండిలో రెండు చెంచాల పెరుగు, కొద్దిగా కీరదోస రసం, ఆలివ్‌నూనె కలిపి ముఖానికి పట్టించాలి.. ఆరిన తర్వాత కడిగేస్తే చర్మం తాజాగా కాంతివంతగా కనిపిస్తుంది. 

 

పావుకప్పు పెసర పిండిలో కొద్దిగా ఆపిల్‌ గుజ్జూ, చెంచా తేనె, అరచెక్క నిమ్మరసం కలిపి ముద్దలా చేసుకోవాలి. దీన్ని ఉదయాన్నే ముఖానికి రాసుకుని పావుగంటాగి గోరువెచ్చని నీళ్లతో కడిగేసుకుంటే ముఖంపై పేరుకున్న నలుపు పోయి తాజాగా కనిపిస్తుంది. ఇలా 2 రోజులకు ఒకసారి చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.

 

మెడా, మోచేతులు నల్లగా మారి, బరకగా ఉంటె అలాంటప్పుడు పావుకప్పు పెసరపిండిలో చెంచా నిమ్మరసం, గులాబీ నీరు కలిపి పేస్ట్ లా తయారూ చేసి సమస్య ఉన్న ప్రాంతాల్లో పూతలా రాయండి. ఇలా తరచూ చేయడం వల్ల చర్మ కాంతివంతంగా తయారవుతుంది. 

 

చూసారుగా.. ఈ పెసరపిండి చిట్కాలు పాటించి మీ చర్మాన్ని కాంతివంతంగా తయారు చేసుకోండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: