మనిషి మొఖంలో ముఖ్యమైనవి కళ్ళు. ముఖం ఎంత అందంగా, కాంతివంతంగా ఉన్నా కంటి కింద న‌ల్ల‌టి వ‌ల‌యాలు అందాన్నే దెబ్బ తీస్తాయి. కళ్ళ క్రింద వలయాలు ఏర్పడితే చూడటానికే ఎంతో వికారం గా ఉంటుంది. అయితే ఇవి వచ్చాక వీటిని తగ్గించుకోవడానికి రకరకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. మార్కెట్ లో లభించే క్రీములు, లోషన్స్ నుంచి.. వంటింటి చిట్కాల వరకు అన్నింటినీ పాటిస్తుంటారు. కానీ, ఎప్పుడైనా కారణాల కోసం వెతికారా ? అదే మీరు చేసే పొర‌పాటు. అందుకే ముందుగా కంటి కింత వ‌చ్చే న‌ల్ల‌టి వ‌ల‌యాల‌కు కార‌ణాలు ఏంటో తెలుసుకోండి.

 

మీరు కలిగి ఉన్న రోజువారి అలవాట్లలో కంటి చుట్టూ వేసుకున్న మేకప్ను తొలగించకపోవడం కూడా ఒకటి. నిదురించే ముందు, మీ కళ్ళకు ఉన్న మేకప్ను సరైన మార్గంలో తొలగించకపోవడం వల్ల కంటి కింద వలయాలు ఏర్పడటానికి కారణమవుతున్నాయి. సరైన నిద్రలేకపోవడం వల్ల శరీరంలో రక్తప్రసరణ నవ దించడానికి కారణమవుతుంది, అందువల్ల మీ కంటి క్రింద నల్లని వలయాలు ఏర్పడటానికి కారణమవుతుంది. అలాగే సూర్యకిరణాల నుంచి ప్రొటెక్షన్ తీసుకోకపోయినా ఈ నల్లటి వలయాలు ఏర్పడటానికి ఛాన్స్ ఉంది. 

 

సూర్య రశ్మి మీ కళ్ల కింద చర్మాన్ని డ్యామేజ్ చేస్తాయని గుర్తుంచుకోండి. కాబట్టి.. సన్ గ్లాసెస్ లేదా సన్ స్క్రీన్ లోషన్ లేకుండా బయటకు వెళ్లకండి. ఇక  త‌ర‌చూ కళ్లను రుద్ద‌డం  కారణంగా మీ సున్నితమైన చర్మానికి హాని కలిగించడమే కాకుండా, శోధ-నిరోధకతలో ప్రతిచర్యలను కలిగి మీ చర్మం నల్లబడడానికి దారితీస్తున్నాయి. మీ కళ్ల చుట్టూ ఉన్న చర్మం చాలా సున్నితమైనది మరియు మృదువైనది కావడం వల్ల, వేడి నీటితో చర్మాన్ని కడగటం వల్ల, దాని యొక్క సహజమైన ఛాయను కోల్పోతుంది. దీంతో కంటి కింత న‌ల్ల‌టి వ‌ల‌యాలు ఏర్ప‌డ‌తాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: