గుమ్మడికాయ‌.. దీని గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇది వండితే వచ్చే రుచి గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఇందులో ఉండే కెరొటనాయిడ్స్ , పీచుపదార్ధాలు, పొటాషియం, విటమిన్ సి లతో పాటు జింక్, ఐరన్, కాల్షియం, కాపర్, ఫాస్ఫరస్ వంటి ఖనిజారు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే కేవ‌లం గుమ్మ‌డికాయే కాదు గుమ్మ‌డి గింజ‌లు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయ‌ని మ‌నంద‌రికీ తెలిసు. ఎవరైతే దీర్ఘకాలిక అనారోగ్యాలు ఆర్థరైటీస్, గుండె సంబంధిత వ్యాధులు, మరియు క్యాన్సర్ వంటి జబ్బులతో బాధపడుతుంటారో అటువంటి వారికి, ఈ ఆరోగ్యకరమైన గుమ్మడి గింజలు బాగా సహాయపడుతాయి.

 

సూపర్ ఫుడ్స్ లిస్ట్ లో గుమ్మడి గింజలను టాప్ లో ఉంచవచ్చు. ఎందుకంటే, వర్కౌట్స్ ముందుగా ఒక గుప్పెడు గుమ్మడి గింజలను తినడం వల్ల మీ ఎనర్జీ లెవల్స్ అమాంతంగా పెంచుకోవచ్చు. అంతేనా అంటే కాదండోయ్‌.. గుమ్మ‌డి గింజ‌ల‌తో చ‌ర్మ సౌంద‌ర్యాన్ని కూడా పెంపొందించ్చు.  ఈ గింజల నూనెలో పోషకవిలువలు పుష్కలంగా ఉంటాయి. అవి జుట్టును, చర్మాన్ని కూడా ఎంతో అందంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. గుమ్మడి గింజల నూనెను ముఖానికి రాసుకుని.. కాసేపు ఆర‌నిచ్చి క‌డిగేస్తే ముఖంపై ఉన్న మ‌లినాలు తొల‌గుతాయి. మ‌రియు గుమ్మ‌డి నూనె చర్మానికి కావాల్సినంత తేమ అందుతుంది. 

 

ఈ గింజల నూనె వాడకం వల్ల యాక్నె, నల్లమచ్చలు వంటివి రావు. గుమ్మడిపండు గింజల నూనెను మాడు మీద రాసి ఒకటి లేదా రెండు గంటలపాటు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత తలస్నానం చేస్తే వెంట్రుకలు సిల్కులా మెరుస్తాయి. గుమ్మడి గింజల నూనె వాడడం వల్ల చర్మం దురదపెట్టడం, దద్దుర్లు, ఇరిటేషన్‌ వంటివి రావు. ఈ నూనె చర్మానికి కావాల్సినంత నీరును అందించడంతోపాటు కొత్త చర్మ కణాలను పునరుద్ధరిస్తుంది కూడా. అంతేకాదు చర్మం బిగువు సడలకుండా కాపాడుతుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: