మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న సరే మన జుట్టు నిర్జీవం అయిపోయి ఊడిపోతుంది. ఎందుకంటే కాలుష్యం, దుమ్ము, దూళి అలాంటివి. అయితే అలాంటి ఈ జుట్టుకు ఏలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటుంది అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి.. వంటింట్లో ఇంట్లో ఉండే ఉల్లిపాయతో.. బయట దొరికే ఉసిరికాయతో ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. అయితే అవి ఏంటి అనేది ఇక్కడ చదివి తెలుసుకుందాం. 

 

ఉల్లిపాయ రసంని తలకు రాసుకోవడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఎందుకంటే ఈ ఉల్లిపాయ రసం కెరటిన్‌, మాంసకృత్తుల్ని అందించి, జుట్టును ఆరోగ్యంగా పెరిగేలా చేస్తుంది. ఉల్లిపాయ ముక్కల రసాన్ని తలకు రాసుకుని, ఇరవై నిమిషాల తరవాత షాంపూతో కడిగేసుకుంటే జుట్టు ఆరోగ్యంగా తయారవుతుంది. 

 

నిమ్మరసంను జుట్టుకు పట్టించడం వల్ల జుట్టు రాలే సమస్య ఇట్టే తగ్గిపోతుంది. అంతేకాదు ఈ నిమ్మరసం కారణంగా జుట్టు ఒత్తుగా తయారవుతుంది. కొబ్బరి నూనెలో కొద్దిగా నిమ్మరసం వేసుకుని తలకు పట్టించుకోవాలి అంతే గంటయ్యాక కడిగేసుకుంటే జుట్టు ఆరోగ్యంగా అందంగా తయారవుతుంది. 

 

ఉసిరి రసంలో విటమిన్‌ 'సి' అధికంగా ఉంటుంది. దీనివల్ల జుట్టు రంగు మారకుండా కూడా ఉంటుంది. 2 చెంచాల ఉసిరి రసంలో నిమ్మరసం కలిపి తలకు పట్టించాలి. అంతే ఇరవై నిమిషాల తరవాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. జుట్టు అందంగా తయారవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: