పొడి చర్మం కారణంగా ఎందరో మహిళలు ఇబ్బందులు పడుతున్నారు.. ఆలివ్ నూనెతో ఎన్ని ఆరోగ్య లాభాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే ఆలివ్ నూనె అంత సహాయం చేస్తుంది. ఇక పోతే ఈ ఆలివ్ నూనెతో పొడి చర్మం సమస్యకు ఏలాంటి చిట్కాలు పాటించాలి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

తేనెలో చక్కెర కలిపి చర్మానికి మర్దన చెయ్యండి.. ఇలా చెయ్యటం వల్ల మృతకణాలు తొలగిపోయి చర్మం తాజాగా తయారవుతుంది. 

 

రాత్రి పడుకునే ముందు పాలలో దూదిని ముంచి ముఖం తుడుచుకోండి. ఇలా చెయ్యడం వల్ల చర్మం తాజాగా, తేమగా మారుతుంది.

 

2 చెంచాల తేనెలో 3 చెంచాల ఆలివ్‌ నూనె, 4 చుక్కల నిమ్మరసం కలిపి మర్దన చేసుకోండి.. 20 నిమిషాలయ్యాక గోరువెచ్చటి నీళ్లతో ముఖం కడిగేసుకుంటే తాజాగా అందంగా తయారవుతుంది. 

 

2 చెంచాల పాల పొడిలో చిటికెడు పసుపు, చెంచా తేనె కలిపి ముఖానికి పూతలా వేసుకోండి కొద్దిసేపటికి తడి టిష్యూతో తుడిచేస్తే పొడి చర్మం సమస్య పోయి చర్మానికి తేమ అందుతుంది. 

 

ఈ చిట్కాలు పాటించి పొడి చర్మం సమస్యకు చెక్ పెట్టండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: