తులసి.. ఔషధీ పరంగానూ, హిందూ సంప్రదాయాలలోనూ ఎంతో ప్రాముఖ్యత ఉన్న మొక్క. దీని వాసన, దీని పై నుంచి వీచే గాలి, నీటిలో కరిగే వచ్చే తీర్థం.. అన్నీ రోగ నివారిణులుగా పని చేస్తుంది. తులసి ఆకుల రసం ఆయుర్వేదంలోనూ, ఇంటి వైద్యం చిట్కాలలోనూ విస్తృతంగా వాడుతారు. జలుబు, తలనొప్పి, పొట్టకు సంబంధించిన వ్యాధులు, వాపులు, గుండె జబ్బులు, విషాహారాలు, మలేరియా వంటి చాలా రకాల రుగ్మతలను నయం చేయడానికి తులసి వాడుతారు. అయితే ఆరోగ్య ప‌రంగానే కాకుండా.. సౌంద‌ర్య ప‌రంగానూ తుల‌సి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది.

 

అందుకు ముందుగా తులసి ఆకులను ఎండబెట్టి పొడిగా చేసుకోవాలి. దీనికి కొంచం నీరు కలిపి మొఖానికి రాసుకోవాలి. ఈ ప్యాకు చర్మ రంద్రాలను తెరుచుకోలాగా చేస్తుంది. దీంతో చర్మం ఫై పెరుకుపోయీన మురికి సులువుగా తొలగి పోవడమే కాకుండా చర్మం కొత్త మెరుపును సంతరించుకుంటుంది. మ‌రియు కొన్ని తులసి ఆకుల్ని తీసుకుని నీటితో మెత్తగా పేస్ట్‌ చేయాలి. ఆ తర్వాత ఇందులో శెనగపిండి, తేనెను కలపాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించుకుని పావు గంట తర్వాత శుభ్రపరచాలి. 

 

ఇలా త‌ర‌చూ చేయ‌డం వ‌ల్ల ముఖంపై ఉన్న మ‌చ్చ‌లు త‌గ్గుతాయి. అలాగే గుప్పెడు తులసి ఆకులను మెత్తగా గ్రైండ్‌ చేసి, కొబ్బరినూనెలో కలుపుకొని, తల వెంట్రుకలకు పట్టిస్తే కుదుళ్లు గట్టిపడటంతో పాటు వెంట్రుక‌లు ఊడిపోకుండా చేస్తుంది. మ‌రియు తులసి, వేప ఆకుల్ని సమంగా తీసుకుని పేస్ట్‌ చేయాలి. ఈ పేస్ట్‌ కళ్లల్లో పడకుండా ముఖానికి అప్లై చేయాలి. అరగంట తర్వాత ముఖాన్ని చల్లటి నీళ్లతో శుభ్రపరుచుకుంటే నొప్పులతో పాటు ముఖంపై ఉండే స్పాట్స్‌ తొలగిపోతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: