ఏదైనా శుభవార్త చెప్పాము అంటే నోరు తీపి చెయ్యండి అంటారు.. అదే మంచి పని చెయ్యాలి అన్న కూడా నోరు తీపి చేసుకోండి అని అంటారు.. ఎందుకంటే చక్కర అంతమంచిది కాబట్టి.. అలాంటి చక్కర నోటికి ఎంత తీయదనాన్ని ఇస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. అయితే చక్కర ఒక్క నోటికే కాదు చర్మానికి కూడా ఎంతో అందాన్ని ఇస్తుంది. అలాంటి ఈ చక్కరతో సౌందర్యాన్ని ఎలా పెంచుకోవాలి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

చిటికెడు చక్కరలో రెండు చుక్కల నీళ్లు వేసి పెదాలపై మృదువుగా రుద్దితే మృతకణాలు తొలిగిపోయి అందంగా తయారవుతాయి. 

 

2స్పూన్ల బ్రౌన్‌ షుగర్‌లో కొన్ని అరటిపండు ముక్కలు వేసి ముద్దగా కలిపి దాన్ని శరీరానికి రాసి మర్దన చేసి కాసేపయ్యాక కడిగేస్తే ఆ మృతకణాలను తొలిగిపోయి చర్మానికి నిగారింపు అందుతుంది.

 

ఎండ కారణంగా చర్మం కమిలిపోయి నల్లగా అవుతే అలాంటప్పుడు చెంచా చెక్కర నూనె కలిపి నల్లగా అయినా చర్మానికి మర్దన చేస్తే మంచి ఫలితం లభిస్తుంది. 

 

కొద్దిగా చెక్కరలో నూనె కలిపి ఆ మిశ్రమాన్ని పాదాలకు పట్టిస్తే పాదాలు మృదువుగా మారతాయి.

 

చూశారుగా.. ఈ చిట్కాలు పాటించి మీ చర్మానికి సహజమైన తీపి మెరుగులు పెట్టండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: