అందమైన మెరిసే గోర్లు ఎవరు కోరుకోరు  చెప్పండి. కానీ ఇంట్లో పనుల వల్ల‌ గోర్లు విరిగిపోవడం, పొడిబారిపోవడం సాధారణంగా జరుగుతూనే ఉంటాయి. అయితే గోర్లు బలంగా అందంగా పెరగాలంటే కొన్ని చిట్కాలతో పాటు పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలి. అప్పుడే గోళ్లు బలంగా చిట్లిపోకుండా పెరుగుతాయి. గుడ్డులో ఎక్కువ మోతాదు లో బయోటిన్‌ విటమిన్‌ ఉంటుంది. ఈ విటమిన్‌ జుట్టు పెరుగుదలకు గోర్లు పెరగడానికి సహయపడుతుంది. ఇది గోర్లు పెరగడంలో సహయపడడమేకాక అందంగా కనబడేలా చేస్తుంది. 

 

అందుకే ప్ర‌తి రోజు ఒక గుడ్డు త‌ప్ప‌నిస‌రిగా తినాలి. అలాగే ఆలివ్ ఆయిల్ ఎంత సహజసిద్ధమైందో తెలిసిందే. అలాంటి ఆలివ్ ఆయిల్‌ను గోర్లకు అప్లై చేయ‌డం వ‌ల్ల‌ సరైన పోషణ అంది.. అవి బలంగా, అందంగా ఉంచేందుకు సహాయపడుతుంది. మ‌రియు ఒక కప్పుడు నీళ్లను మరగబెట్టి అందులో క్రష్ చేయబడిన ఒక వెల్లుల్లి రెబ్బలు మ‌రియు నిమ్మ‌ర‌సాన్ని జోడించండి. దీన్ని మ‌రో పది నిమిషాల పాటు సిమ్ లో మరగనిచ్చి కాసేపు చల్లారనివ్వండి. ఇప్పుడు, ఈ సొల్యూషన్ ను ఒక ఖాళీ సీసాలోకి మార్చుకుని ప్రతిరోజూ మీరు నిద్రపోయే ముందు ఈ సొల్యూషన్ ను మీ గోర్లపై పై అప్లై చేయండి.

 

ఇలా చేయ‌డం వ‌ల్ల.. వెల్లుల్లిలో సల్ఫర్ అనేది అధికంగా లభిస్తుంది. ఇది చిట్లిన గోర్లను దృఢపరచి గోర్ల ఎదుగుదలను ప్రోత్సహిస్తుంది. అదేవిధంగా, నీటిలో గోర్లు ఎక్కువసేపు ఉండడం వలన వాటి దృఢత్వవాన్ని కోల్పోయి విరిగిపోతాయి. అందుకే చేతికి గ్లౌజులు వాడి వాటిని సంరక్షించుకోవాలి. కొబ్బరి నూనెలో కొద్దిగా నిమ్మరసం వేసి వేడి చేయాలి. ఈ మిశ్రమాన్ని గోళ్లకు రాసి మసాజ్ చేస్తే గోళ్లు విరిగిపోకుండా బలంగా పెర‌గ‌డానికి ఎంతో చ‌క్క‌గా ఉప‌యోగ‌ప‌డుతుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: