అలోవెరా.. ఎంత అందాన్ని ఇస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. అద్భుతమైన అందాన్ని ఇచ్చే వరుసలో అలోవెరా ముందు ఉంటుంది. అలాంటి అలొవెరాతో చర్మ సమస్యలు లేకుండా చేసుకోవచ్చు.. పొడి చర్మం నుండి ఉపశమనం పొందచ్చు.. మొటిమలు కూడా అత్యంత తక్కువ సమయంలోనే మాయం అవుతాయి.. మచ్చలు కూడా ఉండవు.. అలోవెరా గుజ్జుతో చర్మాన్ని అందంగా మార్చుకోవచ్చు. అయితే అది ఎలా అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి.. 

 

అలోవెరలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది.. దీని వల్ల పొడి చర్మం మృదువుగా తయారవుతుంది. మొటిమలు.. పొడి చర్మం, జిడ్డు చర్మం ఉన్నవాళ్లు ఎవరైనా అలోవెరాను ఉపయోగిస్తే సహజసిద్ధమైన మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. 

 

ఎండలో బయటకు వెళ్లి వచ్చినప్పుడు చర్మం కందిపోతే ఆ ప్రాంతంలో అలోవెరా గుజ్జు రాస్తే తిరిగి మృదువుగా.. కోమలంగా తయారవుతుంది. 

 

అలోవెరా గుజ్జుతో ముఖానికి మసాజ్ చేస్తే  చర్మం ముడతలు రాకుండా చూసుకోవచ్చు. 

 

కంటి కింద నల్లటి వలయాలు ఏర్పడితే అక్కడ అలోవెరా రసం పట్టిస్తే మంచి ఫలితం లభిస్తుంది. 

 

మొటిమలు.. అలర్జీ ఉన్న ఈ అలోవెరా తక్షణ సాయం చేస్తుంది. 

 

అలోవెరా గుజ్జును అప్పుడప్పుడు ముఖానికి పట్టిస్తే మంచి ఫలితం ఉంటుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: