ఎండాకాలం వచ్చేసింది.. ఈ కాలం చల్లటి పదార్థాలు లేకపోతే నోరు చెడిపోతుంది అనడంలో సందేహం లేదు. ఇప్పుడు నోరు గురించి పక్కన పెడితే ఈ ఎండకు చర్మం ఎలా అవుతుంది అనేది ఒకసారి ఆలోచించండి. ఎంతో అందంగా ఉండే చర్మం.. ఈ ఎండకు కమిలిపోతుంది.. నల్లగా అయిపోతుంది. 

 

అలాంటి సమయంలో ఐసు ముక్కతో అందాన్ని ఎంతో పెంచుకోవచ్చు. అది ఎలా అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

ముఖం పై మొటిమలు, యాక్నె ఉంటే ఐస్ ముక్కల్ని వాటిపై రుద్దితే తక్షణమే ఉపశమనం లభిస్తుంది.

 

ప్రయాణం చేసి ముఖం అలసటగా మారితే ఐసుముక్కలతో ముఖం తుడుచుకుంటే అలసట దూరం అయి ముఖం తాజాగా మారుతుంది. 

 

కొంతమంది అమ్మాయిలకు ఐబ్రోస్‌ చేయించుకున్న సమయంలో అక్కడ నొప్పి బాగా వస్తుంది. అలాంటి వారు ఐబ్రోస్‌ చేయించుకునే ముందు కనుబొమల వద్ద ఐసుముక్కలో రుద్దితే నొప్పి ఉండదు.. 

 

ఎక్కువ సమయం నిద్రపోవడం వల్ల కళ్ళు ఉబ్బిపోతాయి. అలాంటి వారు ఐస్ ముక్కల్ని జిప్‌లాక్‌ బ్యాగుల్లో ఉంచి కళ్ల మీద పెట్టుకుంటే అలర్జీ దూరం అయి కళ్లకు హాయిగా అనిపిస్తుంది. 

 

చర్మం కందిపోయినట్టు అయితే అక్కడ తువాలులో ఐసు ముక్కల్ని ఉంచి తుడిస్తే చర్మ సమస్య దూరం అవుతుంది. 

 

గోళ్ల రంగు వేసుకున్న వెంటనే ఐసు ముక్కలు వేసిన నీళ్లలో వేళ్లని ముంచితే రంగు వేగంగా మారిపోయి అందంగా తయారవుతాయి. 

 

ఇంకేందుకు ఆలస్యం.. వెంటనే ఈ చిట్కాలు పాటించి మీ చర్మాన్ని కాపాడుకోండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: