సాధార‌ణంగా నలుగురిలో అందంగా కనపడాలని ప్రతిఒక్క అమ్మాయికి ఉంటుంది. ఇందుకోసం ఏవేవో ప్రయోగాలు చేస్తుంటారు. అందంగా కనిపించాలంటే అది చర్మం మీద ఆధారపడి ఉంటుంది. సరియైన ఆరోగ్య నియామాలు పాటించకపోవడం వల్ల చర్మం నిగారింపు లేక కళతప్పి కనిపిస్తుంది. కానీ, ఇవేమి ప‌ట్టించుకోకుండా అనేక ర‌కాల ప్రోడెక్ట్స్ పూసుకుంటారు.  అయితే పూర్తిగా స‌హ‌జ సిద్ధ‌మైన ప‌ద్ధ‌తిలో త‌యారు కాబ‌డిన వ‌స్తువుల‌ను వాడితే మ‌న‌కు ఎలాంటి ప్ర‌మాదం లేదు. కానీ ఇప్పుడు త‌యారు చేసే వ‌స్తువులు చాలా వ‌రకు అలా ఉండ‌డం లేదు క‌దా.

 

కృత్రిమ ప‌దార్థాలు, ర‌సాయ‌నాలు క‌లిపి త‌యారు చేస్తున్న‌వే ఎక్కువ‌గా ఉంటున్నాయి. ఈ క్ర‌మంలో నిత్యం మ‌నం వాడుతున్న అలాంటి ప‌లు వ‌స్తువులు మ‌న‌కు క్యాన్స‌ర్ వంటి ప్ర‌మాద‌కర వ్యాధుల‌ను తెచ్చి పెడుతున్నాయ‌ట‌. మ‌రి అవేంటో ఓ లుక్కేసేయండి. సాధార‌ణంగా చాలా మంది మ‌హిళ‌లు లిప్ స్టిక్ లేనిదే ఉండరు. పెదాల నిండుగా ఉండాల‌ని లిపిస్టిక్ తెగ వేసుకుంటారు. అయితే లిప్‌స్టిక్‌ల‌లో తార్, పెట్రోలియం డిస్టిలేట్స్‌, ఫార్మాల్డిహైడ్‌, ప్రొపైల్ పారాబెన్‌, పాలీప్రొపిలీన్ వంటి అనేక కెమిక‌ల్స్ ఉంటున్నాయ‌ట‌.

 

ఇవ‌న్నీ మ‌న‌కు క్యాన్స‌ర్ వంటి ప్ర‌మాద‌క‌ర వ్యాధుల‌ను తెచ్చి పెడ‌తాయి. అలాగే చ‌ర్మం మృదువుగా మారేందుకు ఉప‌యోగించే మాయిశ్చ‌రైజ‌ర్ల‌తో స్కిన్ క్యాన్స‌ర్ వ‌స్తుంద‌ట‌. చ‌ర్మంపై ద‌ద్దుర్లు, దుర‌ద‌లు, వాపులు వ‌స్తాయ‌ట‌. వీటికి బ‌దులుగా స‌హ‌జ సిద్ధ‌మైన ఆయిల్స్ వాడితే మంచిద‌ని అంటున్నారు నిపుణులు. ఇక ఆడ‌వారు ఎక్కువ‌గా క‌ను రెప్ప‌ల‌కు మ‌స్క‌ర వాడుతారు. కానీ, వీటిలో ఉండే కెమిక‌ల్స్ వ‌ల్ల దృష్టి సంబంధ స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ట‌. అదేవిధంగా, చ‌ర్మం అందంగా, గ్లోగా క‌నిపించాల‌ని ఏవేవో ఫెయిర్‌నెస్ క్రీములు వాడ‌తారు. అయితే అందులో ఉండే పెద్ద మొత్తంలో ర‌సాయ‌నాల‌ను మ‌న శ‌రీరంలోకి ప్ర‌వేశించి.. అనేక అనారోగ్యాల‌కు దారితీస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: