సాధార‌ణంగా ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఆయిల్ స్కిన్ సమస్యను ఎదుర్కొంటున్నారు. మ‌రియు ఆయిల్ స్కిన్ వారి బాధ వర్ణణాతీతం. ఎందుకంటే ఎన్ని సార్లు ముఖం శుభ్రం చేసుకున్నా, మేకప్ వేసుకున్నా ప్రయోజనం ఉండదు. తిరిగి కొద్దిసేపటికే స్కిన్ ఆయిలీగా కనబడుతుంది. అంతే కాదు, చర్మం ఆయిల్ అధికంగా ఉన్నప్పుడు, మొటిమలు, మచ్చలు, బ్లాక్ హెడ్, వైట్ హెడ్స్, మరియు ఇతర చర్మం సమస్యలను ఎదుర్కొవల్సి వస్తుంది. ఇక  ముఖంపై జిడ్డు పేరుకుని మేక‌ప్‌ చేసుకున్న తక్కువ సమయంలోనే మళ్లీ నిర్జీవంగా మారుతుంది. దీంతో కొంద‌రు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు.

 

జిడ్డు చర్మతత్వం ఉన్నవాళ్లు మేకప్ వేసుకునే ముందు నీళ్లు కలిపిన నిమ్మరసాన్ని ముఖానికి రాసుకోని పది నిమిషాలయ్యాక కడిగేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల మేక‌ప్ ఎక్కువ స‌మ‌యం ఉంటుంది. మేకప్ అనేది చర్మంలోని ఆయిలీనెస్ వలన తొలగిపోతోందని మీరు గ్రహించిన వెంటనే బ్లాటింగ్ పేపర్ ని తీసుకుని ఆయిలీ నెస్ కలిగిన ప్రదేశాలలో అద్దండి. ఈ విధంగా, చర్మంపైనున్న అదనపు నూనెను తొలగించుకోవచ్చు. ఫేస్ పౌడర్ ని వాడటం ద్వారా మేకప్ ని ఎక్కువ సేపు నిలిపి ఉంచవచ్చు.

 

మీరు ఎంత అందంగా మేకప్ ని వేసుకున్నా ఆయిలీ స్కిన్ వలన చర్మం జిడ్డుగా తయారవుతుంది. కాబట్టి, ఫేస్ పౌడర్ ని వాడి టచ్ అప్స్ ఇస్తూ ఉంటే చర్మంలోని జిడ్డుతనం మటుమాయమవుతుంది. హెవీ మేకప్ వేసుకోవడం వల్ల ఆయిల్ స్కిన్ మరింత వరెస్ట్ గా తయారవుతుంది. ఈ అలవాటు వల్ల మొటిమలు, మచ్చలు పెరుగుతాయి. చర్మంలో ఎక్సెఆయిల్ ఉత్పత్తి అవుతుంది. . కాబట్టి,ఆయిల్ స్కిన్ ఉన్న వారు మేకప్ లైట్‌గా వేసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: