సాధార‌ణంగా స్విమ్మింగ్ అనేది అన్ని వయసుల వారికీ మంచి వినోద కార్యకలాపం. చాలామందికి స్విమ్మింగ్ చేస్తే మంచి ఆరోగ్యం చేకూరుతుందని, మనలో అధికంగా వుండే కేలరీలు ఖర్చయి శరీరం మంచి రూపం సంతరించుకుంటుందని చాలా మందికి తెలుసు. స్విమ్మింగ్ ఒక సరదానేకాకుండా ఇది మీరు బలంగా, ఆరోగ్యంగా ఉండడానికి ఒక గొప్ప మార్గం. ఇది ఒక మంచి వ్యాయామంగా గుర్తించబడింది.అయితే క్లోరిన్ను కలిగి ఉన్న నీటిలో మీరు ఈత కొట్టడం వల్ల, మీ చర్మానికి మరియు మీ జుట్టుకు తీవ్రమైన నష్టం జరగవచ్చు. 

 

అందుకే స్విమ్మింగ్ చేసు ముందు ఆ త‌ర్వాత కొన్ని టిప్స్ ఖ‌చ్చితంగా ఫాలో అవ్వాలి. అవేంటో ఓ లుక్కేసేయండి. ఈత కొలనులో మీరు దిగే ముందు మీ చర్మానికి సన్స్క్రీన్ లోషన్ను అప్లై చేయండి. ఎందుకంటే సన్స్క్రీన్ అనేది సూర్యరశ్మి మరియు క్లోరిన్ నుండి మీ చర్మాన్ని కాపాడుతుంది. కండిషనర్ లేదా హైయిర్ ఆయిల్ వంటివి మీ జుట్టును సహజంగా సంరక్షించేవిగా పనిచేస్తుంది మరియు క్లోరిన్ నుండి మీ జుట్టును కాపాడుతుంది. కాబ‌ట్టి స్విమ్మింగ్‌కు వెళ్లే ముందు జుట్టుకు ఇవి అప్లై చేయాలి.

 

అలాగే స్విమ్మింగ్ నుండి అడుగు బయట పెట్టాక వెంటనే మీరు తలస్నానం చేయడం చాలా మంచిది. అలా చేయడం వల్ల హానిని కలుగజేసే రసాయనాలకు మీరు దూరంగా ఉంచబడతారు. మీ శరీరమంతటికీ మాయిశ్చరైజర్ను అప్లై చేయండి. క్లోరిన్ నీటి లో పూర్తిగా తడిసిన మీ చర్మాన్నర్మాన్ని మృదువుగా కోమలంగా ఉంచడానికి ఇది సహాయపడుతుంది. ఇక ఈత కొట్టిన తరువాత చల్లని లేదా వేడి నీళ్లతో స్నానం చేయడం ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. వాటికి బదులుగా, గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయడం వల్ల మీ చర్మం సహజమైన తేమను కోల్పోకుండా కాపాడబడుతూ ఉంటుంది

  
 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: