భారత వంటకాలలో పసుపు అత్యంత ముఖ్యంగా వాడే  పదార్థము. మ‌రియు ఈ భూమ్మీద అత్యంత శక్తివంతమైన హెర్బ్ పసుపు. ఇక ప‌సుపు లేకుండా వంట‌లు చేయ‌డానికి చాలా మ‌హిళ‌లు ఇష్ట‌ప‌డ‌రు. ప‌సుపు వంట‌లే కాదు ఆరోగ్యానికి మ‌రియు అందాన్ని కాపాడాటానికి కూడా చ‌క్క‌గా ప‌నిచేస్తుంది. అయిన‌ప్ప‌టికీ చాలా మంది ముఖానికి ప‌సుపు రాసుకోవ‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. మన అమ్మమ్మల కాలం నుంచీ సౌందర్య ప్రయోజనాల కోసం పసుపు వాడేవారు. దీంట్లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ సెప్టిక్‌ లక్షణాలు చర్మాన్ని కొత్తరూపు సంతరించుకునేలా చేస్తాయి.

 

అందుకు ముందుగా  పసుపు, మీగడ, శనగపిండి కలిపి పేస్ట్‌లా చేయాలి. జిడ్డు చర్మం గలవాళ్లు మీగడకి బదులు పాలు వాడుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి మ‌సాజ్‌ చేయాలి. ఇలా చేస్తే మృత కణాలు తొలగి, ముఖం కాంతివంతం అవుతుంది. అలాగే పసుపులో ఒక టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ వేసి బాగా మిక్స్ చేయాలి. అలాగే అర టేబుల్ స్పూన్ పెరుగు వేసి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. ఈ  ఫేస్ ప్యాక్ మీ చర్మానికి రిలాక్స్ ఇస్తుంది మరియు డీస్ట్రెస్ గా పనిచేస్తుంది.

 

ముఖంపై వచ్చే మొటిమలను నివారించటానికి చర్మన్ని కాంతివంతంగా మార్చటానికి పసుపు చాలా ఉపయోగపడుతుంది.పాలల్లో పసుపు కలుపుకోని ముఖానికి రాసుకుంటే ముఖ ఛాయ మెరుస్తుంది. ఒక గిన్నెలో పెరుగు, తేనె, కొబ్బరినూనె వేశాక పసుపు వేసి బాగా కలపాలి. ఇలా చేసిన మిశ్రమాన్ని ముఖానికి రాయాలి. పూర్తిగా ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా తరుచుగా చేస్తే ముఖంపై పేరుకున్న మురికి వ‌దిలి.. కాంతివంతంగా మెరుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: