సాధార‌ణంగా వ‌య‌స్సు మీద ప‌డుతుంటే ఎవ‌రికైనా చ‌ర్మంపై ముడ‌త‌లు ప‌డుతుంటాయి. అయితే కొంద‌రికి మాత్రం చిన్న వ‌య‌స్సులోనే చ‌ర్మంపై ముడ‌త‌లు ప‌డుతుంటాయి. వాస్త‌వానికి చర్మంపై ముడతలు ఏర్పడడానికి కేవలం వయస్సు మాత్రమే కారణం కాదు. మ‌నం చేసే కొన్ని కొన్ని పొర‌పాటులు కూడా కార‌ణం అవుతుంటాయి. అవేంటో ఓ లుక్కేసేయండి మ‌రి. ప్రతిరాత్రి మీ మేకప్ తొలగించడం ముఖ్యం, కానీ మీరు మెల్లగా, నిదానంగా చేయాలి.

 

కొంచెం మస్కారా మిగిలిపోయిందని రుద్దటమో, కంటి చుట్టూ చర్మాన్ని పట్టి లాగటమో లాంటివి చేయ‌డం వ‌ల్ల కంటి చివ‌ర ముడ‌త‌లు ప‌డేలా చేస్తుంది. అలాగే ఒక ఒత్తిడికరమైన రోజు తర్వాత మీరు మీ చర్మంపై పట్టిన మురికి, జిడ్డు, దుమ్ము అంతా వదిలించుకుని చర్మాన్ని శుభ్రం చేసుకోవాలనుకుంటారు. ఈ క్ర‌మంలోనే క‌ఠిన‌మైన స‌బ్బులు వాడుతుంటారు. కానీ, చర్మం బాగా శుభ్రపడాలని కఠినమైన సబ్బును వాడటం వలన, అది మీ చర్మపు సహజ నూనెలను కూడా లాగేసి గీతలు, ముడతలు వచ్చేలా చేస్తుంది.

 

స్క్రీన్ ను చూడటానికి అనుక్షణం కళ్ళు చిట్లించి చూడటం, మెడను వంచటం వలన కళ్ళచుట్టూ సన్నని ముడతలు వస్తాయి. అందుక‌ని కాస్త దూరం స్క్రీన్‌ను చూడ‌డం మంచిది. ఆహారానికి సంబంధించినంతవరకు ఆర్గానిక్ పదార్థాలు మీ శరీరానికి చాలా మంచివి, కానీ మీ చర్మానికి అన్నివేళలా కాకపోవచ్చు. ‘ఆర్గానిక్’ ఉత్పత్తి అయినంతమాత్రాన అది తప్పక మీ ముడతలను, వయస్సు మీరే లక్షణాలను తొలగించేస్తుందనే భ్రమలో పడకూడ‌దు. ఈ విష‌యంలో ఖ‌చ్చితంగా కాస్త జాగ్ర‌త్త వ‌హించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: