అందం, ఆరోగ్యం రెండిటిని మెయిన్‌టైన్ చేయ‌డం కాస్త క‌ష్ట‌మే అయినా.. ఇష్టంగా చేస్తే మంచి ఫ‌లితాన్ని పొందొచ్చు. ఇక అస‌లు విష‌యంలోకి వ‌స్తే.. సాధార‌ణంగా కూర‌గాయ‌లు ఆరోగ్యానికి మాత్రమే ఉప‌యోగ‌ప‌డ‌తాయి అనుకుంటారు. కానీ, వాటిని అందంగా కూడా మెరిసిపోవ‌చ్చు. అది తెలియాలంటే లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లిపోదాం. పొటాటో, సెలరీ, కేరట్, వంకాయ వంటి కొన్ని వెజిటబుల్స్ లో చర్మానికి తగిన పోషణనిచ్చే పోషకవిలువలు అనేకం. ఇవన్నీ, నిస్తేజంగా మారిన మీ చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చడంలోనూ ఎంతో చ‌క్క‌గా ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

 

అందుకు ముందుగా.. బీట్ రూట్ ని పేస్ట్ చేసుకుని అందులో రెండు టీస్పూన్ల ఆలివ్ ఆయిల్ ను మిక్స్ చేసుకోవాలి. ఇలా తయారైన మిశ్రమాన్ని ముఖంపై అప్లై చేసి ఇరవై నిమిషాల వరకు అలాగే ఉంచండి. ఇప్పుడు, గోరువెచ్చటి నీటితో చర్మాన్ని కడగండి. ఇలా చేయ‌డం వ‌ల్ల ముఖంపై పేరుకుపోయిన మ‌లినాల‌ను తొలిగించి ప్ర‌కాశవంతంగా మార్చుతుంది. అలాగే రెండు మూడు క్యాబేజ్ ఆకులను బ్లెండర్ లో పేస్ట్‌లా చేసుకోండి. ఇప్పుడు అందులో ఒక టీస్పూన్ తీపిలేని గ్రీన్ టీ ని జోడించండి.

 

ఈ మిశ్ర‌మాన్ని ఫేస్‌కు అప్లై చేసి.. పదిహేను నిమిషాల గోరువెచ్చిన నీటితో క్లీన్ చేసుకోండి. ఇలా చేయ‌డం వ‌ల్ల మొటిమ‌లు, వాటి వ‌ల్ల వ‌చ్చే మ‌చ్చ‌లు త‌గ్గుతాయి. అదేవిధంగా, రెండు టీస్పూన్ల కేరట్ జ్యూస్ లో ఒక టేబుల్ స్పూన్ తేనెను కలపండి. ఇలా తయారైన మిశ్రమాన్ని ఫేస్ ప్యాక్ లా అప్లై చేసుకోండి. పావుగంత‌ తరువాత గోరువెచ్చటి నీటితో ఈ ఫేస్ ప్యాక్ ను తొలగించండి. ఈ సమర్థవంతమైన వెజిటబుల్ ఫేస్ ప్యాక్ ను వారానికి ఒకసారి వాడినట్లైతే మీ చర్మం అందంగా మెరిపిసోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: