చర్మంపై ఏర్పడ్డ మృతకణాలను తొలిగించడానికి మార్కెట్ లో దొరికే క్లెన్సర్లు వాడుతుంటారు.. అయితే అలాంటి ఉత్పత్తులు అవసరం లేకుండానే ఇంట్లో ఉండే కొన్ని చిట్కాలతో ఆ మృతకణాలను తొలిగించచ్చు. అయితే అది ఎలా అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

పాలు.. సహజ క్లెన్సర్ లా ఉపయోగపడుతుంది.. పావు కప్పు పాలలో దూదిని ముంచి దానితో ముఖం అంత మృదువుగా రెండు నిమిషాలు  రుద్ది ఆరిన తర్వాత కడిగేయాలి. అంతే.. ముఖంపై మురికిపోయి చర్మం మృదువుగా తయారవుతుంది. 

 

సెనగపిండిలో పాలను కలిపి ఆ ఫేస్‌ప్యాక్‌ను ముఖానికి రాసుకుంటే పది నిమిషాల తరువాత కడిగేయాలి. దీంతో ముఖం తాజాగా తయారయ్యి మురికి, నల్లటి మచ్చలు తొలగిపోయి చర్మం మెరిసిపోతుంది. 

 

పాలు మాయిశ్చరైజర్‌లా ఉపయోగపడి ముఖంపై రాసుకుని ఆరిన తరువాత కడిగేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే చర్మం పొడిబారదు. పాలు దాదాపు అన్ని చర్మ తత్వాలకూ సరిపోతుంది. 

 

చూశారుగా ఈ చిట్కాలు పాటించి మీ చర్మాన్ని కాపాడుకోండి.. ఆర్టిఫీషియల్ క్రిములకు గుడ్ బై చెప్పండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: