సాధార‌ణంగా చాలా మందికి శరీరం తళతళా మెరుస్తుంటుంది. కానీ మోచేతులు బాగా నలుపుగా ఉంటుంది. దీంతో చాలా ఇబ్బందిగా ఫీల‌వుతుంటారు. వాస్త‌వానికి అందమైన ముఖంతో పాటు, అందమైన చేతులు కూడా కలిగి ఉంటే మరింత అందం వస్తుంది. అయితే చేతులు తెల్లగానే కనబడతాయి, కానీ మోచేతుల వద్ద నల్లగా కనబడితే అసహ్యంగా కనబడితుంది. మ‌రి ఈ స‌మ‌స్య‌కు చెక్ ప‌ట్టాలంటే కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో అయితే స‌రిపోతుంది. మ‌రి అవేంటో ఓ లుక్కేసేయండి.

 

శనగపిండిలో పెరుగు కలిపి పేస్ట్‌లా చేయాలి. ఇది చర్మంపై ఎక్స్‌ఫోలియేట్‌లా పనిచేస్తుంది. వీటిని మోచేతులకు అప్లై చేయాలి. కాస్త ఆరాక నీళ్ల‌తో క్లీన్ చేస్తే నలుపుదనం సులువుగా తగ్గుతుంది. అలాగే బంగాళదుంప తీసుకుని ముక్కలుగా కట్ చేసి పేస్ట్ చేసి రసం తీసి మోచేతులకు అప్లై చేయాలి. పావు గంట‌ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. రోజులో రెండు మూడు సార్లు ఇలా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

 

అదేవిధంగా,  కొబ్బరినూనె, నిమ్మరసం కలిపి మోచేతుల వద్ద రుద్దుకోవాలి. ఆరిన త‌ర్వాత‌ వేడినీళ్లలో ముంచిన టవల్‌తో వారానికోసారి తుడిస్తే సమస్య తొలగిపోతుంది. మ‌రియు ఫ్రెష్ అలోవెర లీఫ్ ను స్పూన్ తో జెల్ తీసుకోవాలి. దీన్ని మోచేతులకు అప్లై చేసి.. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ టిప్‌ను రోజుకు కనీసం రెండు సార్లు అప్లై చేస్తుంటే సులువుగా మోచేతులు న‌లుపు త‌గ్గుతుంది. కాబ‌ట్టి ఖ‌చ్చితంగా ట్రై చేయండి.

 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: