అమ్మాయిల‌ను ప్ర‌ధానంలో వేధించే చ‌ర్మ స‌మ‌స్య‌ల్లో ట్యాన్ ముందు వ‌ర‌స‌లో ఉంటుంది. కాసేపు ఎండలో బయటకు వెళ్లి వస్తే చాలు చర్మం పై భాగం నల్లగా మారటం, కందిపోవటం జ‌రుగుతుంటుంది. అలా అని అసలు బయటకు వెళ్లకుండా ఉండలేని ప‌రిస్థితి. దీంతో ఈ మధ్యకాలంలో చాలా మంది ఈ డార్క్ నెస్ పోగొట్టుకుంటానికి విపరీతంగా డబ్బు ఖ‌ర్చు చేసి పార్ల‌ర్స్ చుట్టూ తిరుగుతుంటారు. అయితే పార్ల‌ర్స్‌తో ప‌ని లేకుండా ఇంట్లోనే ఎంతో సులువుగా ఈ ట్యానింగ్ స‌మ‌స్య‌ల‌ను తొల‌గించుకోవ‌చ్చు.

 

అందుకు ముందుగా నిమ్మరసానికి కాస్త‌ మజ్జిగతో కలపండి. ఈ మిశ్ర‌మాన్ని.. మీ ముఖంపై రుద్ది  ప‌ది నిముషాలు త‌ర్వాత‌ గోరువెచ్చని నీరుతో కడిగేయండి. వారానిరి రెండు సార్లు చేయ‌డం వ‌ల్ల ముఖంపై ట్యాన్ తొలుగుతుంది. అలాగే కొబ్బరి నీళ్ళు కేవలం మీ దాహాన్ని తీర్చటమే కాదు మీ ముఖంపై ఉన్న ట్యాన్ మచ్చల్ని తొలగిస్తుంది. మీ చర్మాన్ని సూర్య కాంతి నుంచీ కందిపోకుండా చూస్తుంది. మీరు రోజూ కనక మీ ముఖానికి కొబ్బరి నీళ్ళు రాసుకోవటం వల్ల ఎంతో మంచిది. 

 

అదేవిధంగా, ఉసిరి రాసాన్ని ప్రతి రోజూ చర్మానికి రాసుకొని గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలాచేయడం వల్ల స్కిన్‌ ట్యాన్‌ పోవడమే కాకుండా చర్మం కూడా మృదువుగా తయారవుతుంది. మ‌రియు సెనగపిండిలో కొద్దిగా పాలు, ఒక టీ స్పూన్ రోజ్ వాటర్, చిటికెడు పసుపు కలిపి ఈ పేస్టును ఫేస్‌కు అప్లై చేయాలి. బాగా ఆరిన త‌ర్వాత గోరువెచ్చిన నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ట్యానింగ్ స‌మ‌స్య‌లు త్వ‌ర‌గా త‌గ్గుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: