రైస్ వాట‌ర్ లేదా బియ్యం నీరును.. సాధార‌ణంగా బ‌య‌ట పార‌బోస్తారు. అయితే ఇక నుంచి అలా చేయండి ఆపండి. ఎందుకంటే ఆ రైస్ వాట‌ర్‌తో మ‌న‌కు ఎన్నో ఉప‌యోగాలు ఉన్నాయి. ముఖ్యంగా చ‌ర్మ స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్టేందుకు రైస్ వాట‌ర్ ఎంతో చ‌క్క‌గా ఉప‌యోగ‌ప‌డుతుంది. అదెలా అనేగా మీ డౌట్‌. అదే ఇప్పుడు తెలుసుకుందాం. బియ్యం నీటిలో ఉండే అమైనో ఆమ్లాలు మరియు విటమిన్లు బి, సి, ఇ వంటివి, మీ జుట్టు మ‌రియు చర్మానికి బాగా పనిచేస్తాయి.

 

అందుకు ముందుగా కాటన్‌ బాల్స్‌తో బియ్యం కడిగిన నీటిని అద్దుకుని ముఖానికి అప్లై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ చర్మం తాజాగా, మృదువుగా తయారవుతుంది. అలాగే రైస్ వాట‌ర్‌ను  ఓ కంటెయినర్‌లో పోసి ముఖంపై స్ప్రే చేస్తుండాలి. ఇలా చేయడం వల్ల కమిలిపోయిన, ఎర్రబడిన చర్మం తిరిగి మాములుగా మారుతుంది. మ‌రియు చర్మ రంధ్రాలు తగ్గించి చర్మాన్ని బిగుతుగా మార్చడంలో ఈ స్ప్రే బాగా పనిచేస్తుంది.

 

అదేవిధంగా, బియ్యం నీటిని కురులకు, కుదుళ్లకు బాగా పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేస్తే సిల్కీ హెయిర్‌ మీ సొంతం అవుతుంది. రెండు టేబుల్ స్పూన్ల రైస్ వాటర్లో ఒక టేబుల్ స్పూన్ గ్రీన్ టీ ని కలపండి. ఈ హోంమేడ్ మిశ్రమంతో మీ చర్మాన్ని క్లీన్ చేసుకోండి. ఆ త‌ర్వాత గోరువెచ్చని నీటితో చర్మాన్ని మరలా శుభ్రపరచండి. ఇలా చేయ‌డం వ‌ల్ల‌ ప్రకాశవంతమైన మెరిసే చర్మాన్ని పొందవచ్చు. మ‌రియు  చర్మంపై రాషెస్‌ ఉన్న చోట ఈ రైస్ వాట‌ర్‌తో కడగడం వల్ల మంచి గుణం కనిపిస్తుంది. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: