సాధార‌ణంగా అందంగా, ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపించ‌డానికి చాలా మంది రకరకాల క్రీములు, లోషన్లు తెగ వాడేస్తుంటారు. మ‌రియు వీటి కోసం ఎంతో ఖర్చు పెడతారు కూడా. అయితే వంటింట్లో లభ్యమయ్యే పదార్థాలతోనే చ‌ర్మానికి మేలు చేసే ఉత్పత్తులు తయారుచేసుకోవచ్చు. ముఖ్యంగా మనం తినే బియ్యం నుండే చర్మ సంరక్షణను ఇనుమడింపజేసుకోవచ్చు. బియ్యం పిండిలో ఉండే ఫిరిలిక్ యాసిడ్ నేచురల్ సన్ స్క్రీన్ గా, ఫ్రీరాడికల్స్ ను న్యూట్రలైజ్ చేస్తుంది. అలాగే చర్మాన్ని హానికర ప్రభావాల నుండి రక్షిస్తుంది.

మ‌రి దీనిని ఎలా ఉప‌యోగించాలి అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం. అందుకు ముందుగా బియ్యం పిండి, అలో వెరా జెల్, తేనె కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. పావు గంట‌ తర్వాత గోరువెచ్చిన నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి. అలాగే  బియ్యం పిండి, ఎగ్‌ వైట్‌, తేనె కలిపిన మిశ్రమాన్ని ముఖానికి పట్టించడం వల్ల చర్మం బిగుతుగా మారుతుంది.

అలాగే బియ్యం పిండి, ఓట్ మీట్, పాల పొడిలను తగినంత మోతాదులో కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఫేస్‌కు అప్లై చేసి పావు గంట త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో క‌డిగేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ముఖంపై మ‌లినాలు తొలిగి ప్ర‌కాశవంతంగా క‌నిపిస్తుంది. మ‌రియు ఆయిలీ స్కిన్ నివారించడానికి బియ్యం పిండి చక్కటి పరిష్కారం. కార్న్ స్టార్చ్, బియ్యం పిండి కలిపి పెట్టుకోవాలి. బయటకు వెళ్లాలి అనుకున్నప్పుడు ఫేస్ పౌడర్ లా దీన్ని ఉపయోగిస్తే.. అదనపు ఆయిల్ ని పీల్చుకుని.. ఫ్రెష్ లుక్ అందిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: