మనకు సహజ అందాన్ని ఇచ్చే మొక్కలు ఎన్నో ఉన్నాయి. అయితే ఆ మొక్కలు ఏంటి? ఆ మొక్కలను ఎలా ఉపయోగిస్తే లాభాలు ఉంటాయి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి.. అందాన్ని పెంచుకోండి. 

 

కలబంద.. 

 

ఎన్నో విటమిన్లు ఉన్న ఈ మొక్క.. చర్మానికి.. జుట్టుకు ఎంతో సహాయ పడుతుంది. ఈ కలబంద కండిషనర్ లా పని చేస్తుంది.. అంతేకాదు ఈ కలబందతో జుట్టు కూడా అత్యంత తక్కువ సమయంలోనే పెరుగుతుంది. చుండ్రును కూడా నివారిస్తుంది. 

 

మందార.. 

 

మందారంలో ఎన్నో ఉపయోగాలు ఉంటాయి.. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఈ ఆకుల రసాన్ని ముఖానికి పట్టించడం వల్ల చర్మం మెరిసిపోతుంది.. కేజుట్టుకు పట్టిస్తే మంచి నిగారింపు లభిస్తుంది. అంతేకాదు జుట్టు కూడా బాగా పెరుగుతుంది. ఇందులో కొన్ని చుక్కల తేనే.. కొన్ని చుక్కల ఆలివ్ ఆయిల్ కలిపి పట్టిస్తే ఇంకా ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. 

 

పుదీనా.. 

 

పుదీనా మచ్చలను, నలుపుదనాన్ని, మొటిమలను చిటికెలో తగ్గిస్తుంది. అంతేకాదు ఈ పుదీనా దురదలను నివారించి చర్మాన్నీ కాపాడుతుంది. 

 

గులాబీ.. 

 

గులాబీలో సౌందర్య పోషణలు ఎక్కువ ఉంటాయి. ఈ గులాబీ నీరు.. ఆయిల్ అన్ని చర్మతత్వాలకు సరిపోతుంది. మొటిమలతో బాధపడేవారికి గులాబీ నూనె మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ నూనెలో యాంటీసెప్టిక్‌, యాస్ట్రిజెంట్‌ సమ్మేళనాలు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: