సాధారణంగా చాలా మంది అర‌టి పండును తిని తొక్క‌ను మాత్రం చెత్త బుట్టలో పాడేస్తుంటారు. కాని, ఇక నుంచి అలా చేయకండి. ఎందుకంటే అర‌టి తొక్క‌తో కూడా ఎన్నో ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి. అరటిపండు తొక్కలో అధిక శాతంలో విటమిన్లు, ఖనిజాలు, బి6 , బీ12, ఏ, సి విటమిన్లు, మాంగనీస్, పొటాషియం, అరిగే పీచు పదార్ధాలు, ప్రొటీన్లు, మెగ్నీషియం, తదితర ప్రోటీన్లు ఉంటాయి. అర‌టి తోక్క ఆరోగ్యాన్ని అందించ‌డ‌మే కాకుండా.. చ‌ర్మానికి ఎంతో చ‌క్క‌గా ఉప‌యోగ‌పడుతుంది.

 

అర‌టి తొక్కతో మొటిమల మీద రుద్దితే ఒక్క రాత్రిలో మటుమాయం అవుతాయి. అలాగే ఎగ్‌‌వైట్‌‌లో అరటిపండు తొక్కను గుజ్జుగా చేసి ముఖానికి పట్టిస్తే ముడుతలు మటుమాయం అవ్వ‌డ‌మేకాకుండా.. ముఖం కాంతివంతంగా మార‌తుంది. అలాగే అరటి తొక్కలో స్ట్రాంగ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షనాలున్నాయి. ఇది దోమకాటు వల్ల ఏర్పడ్డ దద్దుర్ల సైజ్ ను తగ్గించి, మంట, వాపు, నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. అరటి తొక్క దురదను తగ్గిస్తుంది. దోమ కుట్టిన ప్రదేశంలో కూల్ గా మార్చుతుంది.

 

 అందుకు ముందుగా అరటితొక్కకు కొద్దిగా గ్లిజరిన్ కలపి.. ఈ రెండింటిని మెత్తగా పేస్ట్ చేయాలి. తర్వాత దోమలు కుట్టిన చోట ఈ మిశ్రమాన్ని అప్లై చేస్తే స‌రిపోతుంది. అదేవిధంగా, అలర్జీ నుంచీ అరటి తొక్కలు ఉపశమనం కలిగిస్తాయి. రాత్రి పడుకునే ముందు సమస్య ఉన్న చోట అర‌టి తొక్క‌ను రుద్దుతే మంచి ఫలితం ఉంటుంది. మ‌రియు ఏదైనా గాయం తగిలినప్పుడు యాంటీసెప్టిక్ క్రీం అందుబాటులో లేకపోతే అరటి పండు తొక్కతో గాయం చుట్టు పక్కల రాయండి. వెంట‌నే ఉప‌శ‌మ‌నం పొందొచ్చు.

 
  

మరింత సమాచారం తెలుసుకోండి: