చర్మంపై, ముఖ్యంగా ముఖంపై మొండి మచ్చలు కొన్నిసార్లు చిరాకు తెప్పిస్తుంటాయి. చర్మంపై నల్లమచ్చలు రావడానికి అనేక కారణాలుండచ్చు, ముఖ్యకారణం మాత్రం సూర్యుడి హానికర యూవి కిరణాలు. వీటిని తగ్గించుకునేందుకు చాలా మంది రకరకాల ఫేస్ ప్యాక్స్, ట్రీట్‌మెంట్స్ చేసుకుంటారు. అయితే, వాటి వల్ల ఎలాంటి ఫలితం ఉండదు. కానీ, వాటిని సులువైన‌, స‌హ‌జ‌సిద్ధ‌మైన టిప్స్‌తో తొల‌గించుకోవ‌చ్చు. మ‌రి వాటిపై ఓ లుక్కేసేయండి. ఆలివ్ ఆయిల్ అద్భుతమైన తేమను కలిగి ఉంటుందని మనందరికీ తెలుసు.

 

ఇది మచ్చగా ఏర్పడే ప్రధాన భాగం నుండి డెడ్ స్కిన్ సేల్స్ ని తొలగించి, కాలక్రమేణా చర్మం నయంచేయడానికి సహాయపడుతుంది. అలాగే కొంచెం ఉల్లి రసంలో అర స్పూన్‌ తేనె కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. అలా రోజూ ముఖానికి రాయ‌డం వ‌ల్ల‌ కొంతకాలంలోనే మచ్చలు తగ్గిపోతాయి. ఆవనూనె వాసన అందరికీ పడదు. కాని ఇది మచ్చలకి అద్భుతమైన చికిత్స అనే వాస్తవాన్ని తిరస్కరించడానికి లేదు.

 

మొండి మచ్చ‌లకు ప‌ది శాతం ఆవనూనె కలిగిన ఆయింట్మెంట్ ని అనేక వారాల పాటు వాడడం గొప్ప మార్గం. అదేవిధంగా, లావెండర్ ఆయిల్ చాలా మృదువుగా చేయడమే కాక మచ్చలను ప్రభావవంతంగా నయం చేస్తుంది కూడా. ఇది కణాల పునరుత్పత్తి ప్రక్రియను వేగం చేస్తుంది. ఇక అప్పుడే తగిలిన దెబ్బలకు, నీటిలో లవేండర్ నూనె చుక్కలను వేసి దెబ్బమీద రాస్తే అది వేగంగా పనిచేసి, మచ్చలను కూడా తగ్గిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: