శనగపిండి..  భారత వంటకాలలో అతి ముఖ్యమైన ప‌దార్థం. ఎందుకంటే భారతీయ వంటల్లో ఎన్నో వంటలను శనగపిండి లేకుండా చేయడం అసాధ్యం క‌బ‌ట్టి. అయితే శ‌న‌గ‌పిండి కేవ‌లం వంట‌ల‌కే కాకుండా చ‌ర్మ సౌంద‌ర్యాన్ని పెంపొందిస్తుంద‌ని అంద‌రికీ తెలుసు. శనగపిండిని సౌందర్యం కోసం మన పూర్వ కాలం నుండి ఉపయోగిస్తున్నారు. అందానికి మెరుగులద్దడంలో, మేని ఛాయ మెరిపించడంలో, చర్మ సంరక్షణలో శనగపిండి పాత్ర అమోఘం. అయితే ఇది ఎలా ఉప‌యోగ‌ప‌డుతుంది.. ఏ ఏ స‌మ‌స్య‌ల‌కు శ‌న‌గ‌పిండితో చెక్ పెట్ట‌వ‌చ్చు అన్నది కొంద‌రికి అవ‌గాహ‌న లేక‌పోవ‌చ్చు.

 

శనగపిండి చర్మపు పీహెచ్‌ ను సమతులం చేసి, పిగ్మెంటేషన్, మచ్చలను తొలగించి, ముఖమంతటా సమాన ఛాయను పొందేందుకు సహాయపడుతుంది. మృతచర్మ కణాలను తొలగించి వేయడంలో ప్రధాన పాత్రను పోషిస్తుంది. అలాగే సూర్యుని ప్రభావం వలన ఏర్పడిన ట్యాన్ ను తొలగించి చర్మం కాంతివంతంగా మెరిసేటట్టు చేయ‌డంతో శ‌న‌గ‌పిండి ఎంతో చ‌క్క‌గా ఉప‌యోగ‌ప‌డుతుంది. అందుకు ముందుగా.. శనగ పిండి, పచ్చి పాలు మరియు పసుపును క‌లిపి మిక్స్ చేసి ఫేస్‌కు అప్లై చేయాలి.

 

ఇలా చేయ‌డం వ‌ల్ల ముఖం పేరుకున్న ట్యాన్ రిమూవ్ అవుతుంది. అలాగే కొద్దిగా శనగపిండి తీసుకుని దానికి కొద్దిగా పాలు, కొంచెం తేనె, చిటికెడు పసుపు వేసి మిశ్రమంలా కలుపుకోవాలి. ఈ ప్యాక్ ని రెగ్యులర్ గా ఫేస్ కి అప్లై చేయడం వల్ల చర్మంలో మాయిశ్చరైజర్ లెవెల్స్ తగ్గిపోకుండా కాపాడుతుంది. మ‌రియు తేనెను శనగపిండిలో కలిపి  రెగ్యులర్ గా ముఖానికి అప్లై చేస్తూ ఉండాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల పింపుల్స్ త‌గ్గ‌డ‌మే కాకుండా.. బ్రైట్‌గా కూడా క‌నిపించ‌వ‌చ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: