కొబ్బరి.. కొబ్బరి నూనె.. ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా? ఎన్ని ప్రయోజనలో తెలుసా? అందరూ కేవలం జుట్టుకు మాత్రమే లాభం అనుకుంటారు.. కానీ ఈ కొబ్బరి నూనె వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.. అయితే అవి ఏంటి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి.. జుట్టును ఆరోగ్యంగా చేసుకోండి. 

 

కొబ్బరి నూనెను వేడిచేసి రాత్రి పడుకోబోయే ముందు జుట్టుకు పట్టించి బాగా మర్దనా చేసుకుంటే జుట్టు అందంగా.. వత్తుగా పట్టులా పెరిగి మెరిసిపోతుంది. 

 

గోరువెచ్చని కొబ్బరినూనెలో కొన్ని చుక్కల టీ ట్రీ నూనె వేసి తలకు పట్టించి బాగా మర్దనా చేసుకుంటే జుట్టు వత్తుగా పెరుగుతుంది. 

 

మెంతులను ఒక రోజు అంత నానబెట్టి ఆ నీటిలో కొబ్బరినూనె కలిపి జుట్టు కుదుళ్లకు, వెంట్రుకలకు పట్టించి అరగంట తర్వాత స్నానం చేస్తే జుట్టు రాలడం తగ్గుతుంది. 

 

కొబ్బరినూనెలో కొన్ని చుక్కల టీట్రీ నూనె వేసి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టిస్తే అందంగా తయారవుతుంది. 

 

రాత్రి పడుకునే ముందు పాదాలకు కొబ్బరినూనె పట్టించి సాక్సు వేసుకుంటే కొద్దీ రోజులకు మీ పాదాల పగుళ్లు తగ్గుతాయి.

 

ఈ చిట్కాలు అన్ని పాటించి మీ జుట్టును అందంగా మార్చుకోండి.. పాదాల పగుళ్ళను పోగొట్టుకోండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: