సాధారణంగా పెర్ఫ్యూమ్ వాడ‌డం అంటే ఇష్ట‌ప‌డ‌ని వారు చాలా అరుదుగా క‌నిపిస్తారు. నలుగురిలోకి వెళ్లాలనుకునేప్పుడు, ప్రత్యేక సందర్భాల్లో గుప్పుగుప్పుమని సువాసనలు వెదజల్లే పెర్ఫ్యూమ్స్‌ను ఎంద‌రో ఉప‌యోగిస్తుంటారు. నాడీ వ్యవస్థను ఉత్తేజ పరచి ఎంతటి మానసిక ఒత్తిడినైనా దూరం చేయటం, ఎదుటివారి దష్టిని ఆకర్షించేందుకు, మనపట్ల ఒక సానుకూల భావన కలిగేందుకూ పరిమళాలు దోహదపడతాయి. అయితే ఎంత ఖ‌ర్చు పెట్టి పెర్ఫ్యూమ్స్ కొనుగోలు చేసిన‌ప్ప‌టికీ.. ఆ సువాసన యొక్క తీవ్రత కేవలం కొన్ని గంటల్లోనే పూర్తిగా ఆవిరైపోతుందన్న వాస్తవం.

 

కాబ‌ట్టి.. మీ పెర్ఫ్యూమ్ దీర్ఘకాలంపాటు సువాసనలను వెదజల్లాలి అంటే మీరు తప్పకుండా కొన్ని టిప్స్ ఫాలో అయితే స‌రిపోతుంది. సాధార‌ణంగా మనం వేసుకొనే బట్టల నుండి మంచి సువాసన రావాలనే పెర్ఫ్యూమ్‌ను యూజ్ చేస్తాం. నిజానికి సరైన పద్దతి ఏమిటంటే, స్నానం చేసిన తర్వాత బట్టలు వేసుకొనే ముందు పెర్ఫ్యూమ్ను ఉపయోగించాలి. ఇలా ఎక్కువసేపు సువాసనలను వెదజల్లడమే కాకుండా, మీరు వేసుకున్న బట్టలను లేదా ఆభరణాలను నాశనం చేయకుండా కూడా ఉంటాయి. మీ మణికట్టులను ఒకదానితో మరోకటి రుద్దడం వల్ల, అప్లై చెయ్యబడిన పెర్ఫ్యూమ్ యొక్క సువాసన అనేది చాలా త్వరగా ఆవిరైపోతుంది.

 

కాబ‌ట్టి ఈ విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాలి. అలాగే ఎక్కువకాలం పాటు పెర్ఫ్యూమ్ యొక్క సువాసన నిలచి ఉండేలా పల్స్ పాయింట్ వద్ద పెర్ఫ్యూమ్ను వాడి చూడండి. రెండు చేతులు మణికట్టుల వద్ద, చెవుల వెనక, మెడకింద మధ్య భాగంలో పెర్ఫ్యూమ్ను వెదజల్లండి. ఇలా చేయ‌డం వ‌ల్ల కూడా పెర్ఫ్యూమ్ పరిమళం ఎక్కువ సమయం ఉంటుంది. మ‌రియు బాడీ లోషన్ లేదా హైయిర్ జెల్ వంటి ఉత్పత్తులలో కొంచెం పెర్ఫ్యూమ్‌ను కలిపి వాడి, మీ చర్మంపై యూజ్ చేయ‌డం వల్ల ఎక్కువ టైమ్‌ మంచి సువాసనను వెదజల్లుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: