అమ్మాయికి అందాన్ని తెచ్చేది ఏది అంటే అది ఖచ్చితంగా జుట్టు అనే చెప్పాలి. ఎందుకంటే జుట్టులేదు అంటే అంటే గుండక్క అని పిలుస్తారు.. అది పిలవడం పక్కన పెడితే.. ఈ కాలం అమ్మాయిలు ఉపయోగించే షాంపుల కారణంగా ఉన్న జుట్టు అంత ఊడిపోతుంది. అలాంటి సమయంలో సహజసిద్ధమైన చిట్కాలు ఉపయోగించారు అంటే జుట్టు వత్తుగా బలంగా అందంగా మెరిసిపోతుంది. 

 

కొబ్బరి పాలలో రెండు చెంచాల ఆలివ్ నూనె కలిపి జుట్టుకు పట్టించి తలస్నానం చేస్తే జుట్టు ధగధగా మెరిసిపోతుంది. 

 

జుట్టు పొడిబారి నిర్జీవంగా తయారవుతే అరటిపండు, కొంచెం పెరుగు, కాస్త తేనెను కలిపి తలకు పట్టిస్తే జుట్టు మెరిసిపోతుంది. 

 

జుట్టుకు సరైన పోషణ లేక రాలిపోతుంటుంది.. అప్పుడు గుడ్డుసొనలో చెంచా తేనె, కొద్దిగా ఆలివ్‌ నూనె వేసి బాగా కలిపి దాన్ని జుట్టుకు పట్టిస్తే జుట్టు రాలడం తగ్గి మెరిసిపోతుంది. 

 

గుడ్డుసొనలో కొద్దిగా బటర్‌ వేసి బాగా కలిపి ఈ మిశ్రమాన్ని తలకు పట్టిస్తే జుట్టు చిట్లిపోవడం తగ్గి ఒత్తుగా పెరుగుతుంది. 

 

చూశారుగా... ఈ చిట్కాలు పాటించి జుట్టును దృడంగా.. అందంగా తయారు చేసుకోండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: