కొబ్బ‌రి నూనె.. అంటే కేవ‌లం త‌ల‌కు మాత్రం ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని కాదు.. మ‌రెన్నో ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి. ముఖ్యంగా కొబ్బరి నూనెను ముఖానికి కూడా వాడవచ్చు. కొబ్బరి నూనె ముఖానికి వాడటం వల్ల‌ ముఖం కాంతివంతంగా మారుతుంది. కొబ్బరి నూనె న్యాచురల్ ఆయిల్ మాత్రమే కాదు ప్రభావవంతంగా మరియు సురక్షితంగా పనిచేస్తుంది. కొబ్బరి నూనెలో ఉండే కొన్ని గుణాలు ఏజింగ్ లక్షణాలను దూరం చేసి యవ్వనంగా కనబడేలా చేస్తుంది. అలాగే కొబ్బ‌రి నూనెతో కొన్ని కొన్ని టిప్స్ ఫాలో అవ్వ‌డం ద్వారా ప్ర‌కాశ‌వంత‌మైన ముఖంతో మెరిసిపోవ‌చ్చు.

 

అందుకు ముందుగా కొబ్బరి నూనెను బాడీ మొత్తానికి అప్లై చేసి మసాజ్ చేయాలి. చర్మంలో పూర్తిగా ఇంకిన తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. కొబ్బరి నూనె చర్మంను సాప్ట్ గా మార్చుతుంది. చర్మానికి నేచురల్ మాయిశ్చరైజర్ ను అందిస్తుంది. ఇందులో ఉండే ఫ్యాటీయాసిడ్స్ చర్మంలో కోల్పోయిన మాయిశ్చరైజను తిరిగి తీసుకొస్తుంది. అలాగే కళ్లకింద నల్ల వలయాలు చాలామందిలో కనిపించే సమస్య. అక్కడ చర్మం అతి సున్నితంగా ఉంటుంది.

 

కాబట్టి.. ఇక్క‌డ‌ కొబ్బరినూనెని రాస్తూ ఉంటే నల్లని వలయాలు, ముడతలు తగ్గుతాయి. అదేవిధంగా, కొబ్బరి నూనె మ‌రియు ఆముదం నూనె మిశ్రమాన్ని కొన్ని చుక్కలను అరచేతిలో తీసుకుని ముఖానికి అప్లై చేసి సున్నితంగా మ‌సాజ్ చేయాలి. ఒక గంట తర్వాత చ‌ల్ల‌టి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ముఖంపై ఉన్న ముడ‌త‌లు త‌గ్గ‌డ‌మే కాకుండా కాంతివంతంగా కూడా చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: