పొల్యూషన్ కారణంగా జుట్టు నిర్జవంగా తయారయ్యి.. జుట్టు ఊడిపోతుంది. అయితే అలాంటి జుట్టుకు కొన్ని సహజసిద్ధమైన పదార్ధాలతో మీ జుట్టును అందంగా మార్చుకోండి. అయితే సహజసిద్ధమైన చిట్కాలు ఏంటి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. అందమైన జుట్టును మీ సొంతం చేసుకోండి. 

 

అరకప్పు యాపిల్‌ సైడర్ వెనిగర్‌, అరకప్పు నీళ్లూ కలిపి స్ప్రే సీసాలో పోయాలి.. ఆతరవాత దీన్ని తలంతా స్ప్రే చేసుకోవాలి. అప్పుడు నెమ్మదిగా మర్దన చేసుకోవాలి.. అంతే జుట్టు మెరిసిపోతుంది. 

 

వంటసోడాతో తలలో పేరుకుపోయిన జిడ్డు, మురికి ఈజీగా తొలిగిపోతాయి. అయితే ఈ చిట్కా ఎలా ఉపయోగించాలి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 2 చెంచాల వంటా సోడాలో కొన్ని నీళ్లుపోసి ముద్దలా చేసి అందులో కొన్ని చుక్కల ఆలివ్‌ నూనె కలిపి తలకు పట్టించండి.. ఆతర్వాత కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది.

 

నిమ్మకాయను, కీరదోస రసంతో కలిపి రాసుకొని మర్దన చేసుకొని కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది.

 

గ్రీన్‌, బ్లాక్‌ టీతో జుట్టును శుభ్రపరచుకోవలి. ఈ చిట్కా వల్ల పోషణ అంది ఆరోగ్యంగా మెరిసిపోతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: