సాధార‌ణంగా ఒత్తైన శిరోజాలు అమ్మాయి అందాన్ని రెట్టింపు చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. కాని, ఎప్పుడైతే జుట్టు మూలాలు బలహీనంగా మార‌తాయో.. జుట్టు రాలడం,జుట్టు నిర్జీవంగా మారడం, జుట్టు బ్రేక్ అవ్వడం లాంటి స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. అయితే చాలా మంది బ‌ల‌మైన సిల్కీ అండ్ సాఫ్ట్ చుట్టు కోరుకుంటారు. ఈ క్ర‌మంలోనే బ్యూటి పార్ల‌ర్స్ చూట్టూ తిరుగుతుంటారు. కాని, ఎలాంటి ఖ‌ర్చు లేకుండా.. ఇంట్లో ఉండే ప‌దార్థాల‌తోనే సిల్కీ అండ్ సాఫ్ట్ హెయిర్ పొందొచ్చు.

 

మ‌రి అది ఎలాగో చూసేయండి. అందుకు ముందుగా ఉసిరి పొడి, శీకాయ పొడి, కోడిగుడ్డు.. ఈ మూడిటిని మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ ని మాడుకు, జుట్టు పొడవు నుండి మూలాల వరకు రాయండి. కొద్ది నిమిషాలపాటు మీ వేళ్ళతో స్కాల్ప్ పై సున్నితంగా మర్దనా చేయండి. గంట త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో జుట్టును శుభ్రం చేసుకోండి.

 

ఇలా చేయ‌డం వ‌ల్ల సిల్కీ అండ్ సాఫ్ట్ హెయిర్‌ను పొందొచ్చు. అలాగే రాత్రిపూట నీటిలో కొన్ని మెంతులను నానబెట్టండి. మరుసటి రోజు ఉదయం వాటిని నిమ్మరసం తో పాటు కలిపి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పడు ఈ మిశ్రమాన్ని మీ తలకి రాసి కాస్సేపు మర్దనా చేయండి తలపై ఒక గంట సేపు ఉంచుకొని తరువాత, దానిని కడిగేయండి. ఇలా చేయ‌డం వ‌ల్ల కూడా మంచి ఫ‌లితం పొందొచ్చు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: