మొటిమలు.. కొంతమందికి ఎక్కువ వస్తాయి... కొంతమందికి అసలు రావు.. ఒకవేల మొటిమలు వచ్చాయి అంటే మాత్రం అసలు తగ్గవు. అలా వచ్చిన మొటిమలు మానిపోయినప్పటికీ వాటికీ సంబంచిన మొటిమలు ఉండి తెగ ఇబ్బంది పెడుతాయి. అలాంటి మొటిమలను గృహ వైద్యంతో ఇలా తగ్గించుకోండి. 

 

దాల్చిన చెక్క పొడిగా చేసి అందులో కొద్దిగా తేనె కలిపి ఆ మిశ్రమాన్ని మొటిమలు ఉన్న చోట రాత్రి పూట పట్టించి ఉదయమే కడిగేయాలి. ఇలా రెండు వారాల పాటు చేస్తే మొటిమల సమస్య త్వరగా తగ్గుతుంది. 

 

జాజికాయను పొడిలా చేసి అందులో తగినన్ని పాలు కలిపి ఆ పేస్ట్ ని ముఖానికి రాసుకోవాలి. కాసేపటికి కడిగేయాలి.. అంతే మొటిమలు ఈజీగా మాయం అవుతాయి. 

 

కమలా తొక్కల పొడి రెండు చెంచాలు తీసుకొని అందులో అందులో కొన్ని చుక్కల నిమ్మరసం, వేరుసెనగ నూనె కలిపి ఆ మిశ్రమాన్ని మొటిమల మీద రాస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.

 

నిమ్మరసంలో దూదిని ఉండలుగా చేసి కాసేపయ్యాక ఆ దూదితో మొటిమల మీద రాస్తే మచ్చలు తగ్గిపోతాయి. 

 

గులాబీ నీళ్లూలో నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించాలి అరగంట తర్వాత టొమాటో గుజ్జు రాసి వదిలేస్తే మొటిమలు క్రమంగా తగ్గుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: