కొబ్బరి పాలు.. నిజంగా ఇవి అందాన్ని బాగా పెంచుతాయి. ఎలా అని మీకు అనిపించినప్పటికీ కొబ్బరి పాలు అందాన్ని బాగా పెంచుతాయి. ఎన్నో పోషకాలు ఉన్న ఈ కొబ్బరి పాలతో చర్మం మెరిసిపోతుంది. అయితే ఈ కొబ్బరి పాలతో జుట్టుకూడా నిఘా నిఘాలాడుతూ పెరుగుతుంది. 

 

కొబ్బరిపాలను తలకు పట్టించి మూడు నుంచి ఐదు నిమిషాలపాటు మర్దన చేసి తలస్నానం చేయాలి. అప్పుడు జుట్టుకు తగిన తేమా, పోషణా లభించి జుట్టు కుదుళ్లును బలపరుస్తాయి. 

 

పొడిబారి నిర్జీవంగా, బలహీనంగా మారిన జుట్టుకి బలం చేకూరాలంటే కొబ్బరి నూనె చేర్చి తలకు పట్టించి అరగంట సేపు ఆరనిచ్చి తలస్నానం చెయ్యాలి. అంతే జుట్టు బాగా పెరుగుతుంది. 

 

జుట్టు రాలే సమస్య ఉంటే 50 మిల్లీ గ్రాముల కొబ్బరిపాలకు వంద మిల్లీ గ్రాముల మంచినీళ్లు, టేబుల్‌ స్పూను కర్పూరం కలిపి తలకు పట్టిస్తే జుట్టు రాలే సమస్య చిటికేలో తగ్గిపోతుంది.  

 

పొడిబారిన చర్మానికి కొబ్బరి పాలు ఎంతో ఉపయోగపడుతాయి. కొబ్బరి పాలు ముఖానికి పట్టిస్తే చాలు చర్మం మృదువుగా మెరిసిపోతుంది. 

 

చూశారుగా.. కొబ్బరి పాలతో ఎన్ని లాభాలో.. ఇంకేందుకు ఆలస్యం వెంటనే కొబ్బరి పాలను తలకు పట్టించండి.. మంచి లాభం ఉంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: