దానిమ్మ.. దీన్ని ఇష్ట‌ప‌డ‌ని వారుండ‌రు. ఎందుకంటే దానిమ్మ ఎంత టేస్టీగా ఉంటుందో.. అంత ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది. ఇక దానిమ్మపండులో ఉండే పోషకాలు ఆరోగ్యానికి ఉపయోగపడతాయని అందరకీ తెలిసిందే. అయితే వీటి గుణాలను పరిశీలిస్తే దానిమ్మ గింజల్లో ఉండే యాంటీ ఏజింగ్‌ కారణంగా మన అందాన్ని రక్షించడంలో కూడా ఉప‌యోగ‌ప‌డుతుంది. మ‌రియు అనేక చ‌ర్మ స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్ట‌డంతో దానిమ్మ‌ కీలకపాత్ర పోషిస్తుంది. కాని, చాలా మందికి దీన్ని చ‌ర్మానికి ఎలా ఉప‌యోగించాలో తెలియ‌క‌పోవ‌చ్చు. అలాంటి వారు ఇప్పుడు చెప్ప‌బోయే టిప్స్ ఫాలో అవ్వండి.

 

ముందుగా ముఖాన్ని క్లీన్ చేసుకుని దానిమ్మ ర‌సానికి నిమ్మరసాన్ని కలిపి స్క్రబ్ లాగా తయారు చేసుకుని ముఖానికి అప్లై చేయాలి. పావు గంట‌ తర్వాత చ‌ల్ల‌టి నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల మొటిమలు తగ్గి ముఖం కాంతివంతంగా మారుతుంది. అలాగే పావు కప్పు దానిమ్మ రసం రోజూ తాగితే దీనిలో ఉండే విటమిన్‌-ఎ, సి, ఇ, బి-5లు కణాల విధ్వంసానికి కారణమయ్యే ఫ్రీరాడికల్స్‌ పని పట్టి యవ్వనంగా ఉండేలా స‌హ‌యాప‌డుతుంది.

 

ఇక దానిమ్మే కాకుండా దానిమ్మ తొక్క‌లు కూడా చ‌ర్మానికి బాగా ఉప‌యోగ‌ప‌డ‌తాయి. దానిమ్మ పండు తొక్క ఉపయోగించి చర్మంపై గాయాలకు మర్దన చేస్తే పాత కణాలను తొలగించి, నూతన కణాల ఉత్పత్తికి తోడ్పడుతుంది. అంతేకాదు దీనిలోని ఫ్యూనిక్‌ ఆసిడ్‌, ఒమేగా-3 ఫాటీ ఆసిడ్‌లు చర్మం హైడ్రేట్‌, తేమను కోల్పోవటాన్ని నివారిస్తుంది. మ‌రియు దానిమ్మరసాన్ని ముఖానికి త‌ర‌చూ రాసుకోవ‌డం వ‌ల్ల మొటిమలు, చర్మ పగుళ్ళను, మచ్చలను, దురదలను అదుపుచేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: