అందమైన శిరోజాలంటే ఎవ‌రికి ఇష్టం ఉండ‌దు చెప్పండి. జుట్టు రాలకుండా ఉండటానికి, పొడవుగా పెరగడానికి బహుశా మనం ఉపయోగించినన్ని ఉత్పత్తులు మరెవ్వరూ ఉపయోగించి ఉండరు. అయినా సమస్య మాత్రం అలాగే ఉంటుంది. జేబుకు మాత్రం చిల్లుపడుతుంది. ఇక కొందరు జుట్టే తమ స్టేటస్ సింబల్, స్టైలిష్ ఐకాన్ అన్న ఆలోచనలో కూడా ఉంటుంటారు. వయస్సు పెరిగే కొద్దీ కొంచెం రాలినట్లు కనిపించినా, ఏమాత్రం అనారోగ్యకర లక్షణాలు ఎదురైనా మానసిక క్షోభకు గురవుతుంటారు.

 

అయితే ఆకుకూరలు జుట్టు పోష‌ణ‌కు ఎంతో చ‌క్క‌గా ఉప‌యోగ‌ప‌డ‌తాయి. అందుకు ముందుగా మజ్జిగలో ఒక కప్పు చింతచిగురు, ఒక కప్పు గోరింటాకుపొడి తీసుకొని దానిలో అరకప్పు శనగపిండిని కలపాలి. దీనిని త‌ల‌కు పట్టించి అర గంట‌ తర్వాత త‌ల స్నానం చేయాలి. ఇది జుట్టుకు మంచి కండీషనర్‌లా పనిచేస్తుంది. అంతే కాకుండా చండ్రు, ఇత‌రిత‌ర స‌మ‌స్య‌లు కూడా త‌గ్గుతాయి. ఆయిలీ హెయిర్ కలిగినవారు.. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉన్న కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు తింటి మంచి ఫ‌లితం ఉంటుంది.

 

అదేవిధంగా, అవిసె ఆకులలో గోరింటాకు ,  ఉసిరిపొడి వేసి మెత్తని పేస్ట్‌గా తయారుచేయాలి. అయితే ముందుగా తలకు నూనె రాసి ప‌ది నిముషాలు మసాజ్ చేసి ఆ తర్వాత మీరు తయారుచేసుకున్న పేస్ట్ తలకు ప‌ట్టించాలి. అర‌గంట‌ తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తూ ఉంటే జుట్టు రాలే సమస్య, జుట్టు తెల్ల‌ప‌డ‌డం త‌గ్గుతాయి. మ‌రియు పొనగంటి కూర, గోరింటాకుపొడి, మెంతిపొడి, పెరుగు, కొద్దిగా నీళ్లు కలిపి తలకు పట్టించి పావు గంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేస్తే జుట్టు స్మూత్‌గా త‌యార‌వుతుంది.


  

మరింత సమాచారం తెలుసుకోండి: